📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: America: మేయర్‌గా మమ్దానీ అసలు కారణం ఇదేనా ?

Author Icon By Sushmitha
Updated: November 6, 2025 • 12:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ సోషలిస్ట్ అభ్యర్థి జొహ్రాన్ మమ్దానీ సంచలన విజయం సాధించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ నగరానికి తొలి ముస్లిం, వలసదారు మేయర్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. అయితే, ఆయన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ‘ఉచితాల’ (Freebies) మోడల్ హామీలే ఈ గెలుపు వెనుక కీలక పాత్ర పోషించాయని, ఇది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

Read Also: Donald Trump: భారత్-పాక్ మధ్య యుద్ధం మళ్లీ మళ్లీ అదే పాట

America

ఉచిత బస్సు ప్రయాణం: ఆప్ ‘పింక్ టికెట్’ తరహా వ్యూహం

మమ్దానీ ఇచ్చిన ప్రధాన హామీ న్యూయార్క్ నగరంలో బస్సు ప్రయాణాన్ని పూర్తిగా ఉచితం చేయడం. ఈ పథకం ఢిల్లీలో(Delhi) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రవేశపెట్టిన ‘పింక్ టికెట్’ పథకాన్ని పోలి ఉంది. 2019లో కేజ్రీవాల్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు(Free bus) ప్రయాణ సౌకర్యం కల్పించగా, అది 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ భారీ విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో కూటమి కూడా మహిళలకు ఉచిత బస్సు హామీ ఇచ్చి విజయం సాధించాయి. ఇప్పుడు అదే తరహా వ్యూహాన్ని మమ్దానీ న్యూయార్క్‌లో అమలు చేయబోతున్నారు.

నిధుల సేకరణ, ఇతర సంక్షేమ హామీలు

న్యూయార్క్‌లో(New York) బస్సులను ఉచితం చేయడానికి ఏటా 1.2 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా. ఈ నిధుల కోసం మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం ఉన్నవారిపై 2 శాతం పన్ను విధించాలని, కార్పొరేట్ సబ్సిడీలను తగ్గించాలని మమ్దానీ ప్రతిపాదించారు. ఢిల్లీలో రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయించగా, మమ్దానీ సంపన్నులపై పన్ను ద్వారా ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఈయన మేనిఫెస్టోలో యూనివర్సల్ చైల్డ్ కేర్, ఇళ్ల అద్దెల పెరుగుదల 3 శాతానికి మించకుండా నియంత్రించడం, తక్కువ ధరలకే నిత్యావసరాలు అందించే ‘పీపుల్స్ మార్కెట్స్’ ఏర్పాటు వంటి హామీలు ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో ఒకటైన న్యూయార్క్‌లో, భారత్‌లోని పేద రాష్ట్రాల్లో విజయవంతమైన ఉచిత హామీలకు ఆదరణ లభించడం విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Arvind Kejriwal Delhi Pink Ticket free bus scheme Free public transport Google News in Telugu Latest News in Telugu New York elections New York Mayor Telugu News Today Zohran Mamdani

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.