America: పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తన దూకుడును తగ్గించుకోవడానికి అమెరికా సైనిక శక్తి కారణమని ఆయన స్పష్టం చేశారు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపిన దాడుల వల్లే తెహ్రాన్ పాలకులు వెనక్కి తగ్గారని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లోని క్షిపణి తయారీ కేంద్రాలు, లాంచర్లను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడులు ఆ దేశ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీశాయని, అందుకే ఇప్పుడు వారు శాంతి మంత్రం జపిస్తున్నారని పేర్కొన్నారు.
Read Also: Iran Israel War: ఇరాన్‌లో లీటర్ పెట్రోల్ కేవలం రూ. 5?
పొరుగు దేశాలకు విముక్తి
ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పడంపై ట్రంప్ స్పందించారు. “ఇరాన్ ఇకపై మధ్యప్రాచ్య దేశాలను భయపెట్టే స్థితిలో లేదు. గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పడం వారి బలహీనతను సూచిస్తోంది. అమెరికా ఒత్తిడి వల్లే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు” అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ఇకపై ఇరాన్ తన పొరుగు దేశాలపై ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పేందుకు ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడం అత్యవసరమని, ఆ పనిని అమెరికా విజయవంతంగా పూర్తి చేసిందని ఆయన వెల్లడించారు. ఇరాన్ బెదిరింపుల నుంచి గల్ఫ్ దేశాలకు విముక్తి లభించిందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: