📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత

Telugu News: America:వలసవిధానంపై జేడీ వాన్స్ పై ప్రశ్నల వర్షం కురిపించిన భారత మహిళ

Author Icon By Pooja
Updated: October 31, 2025 • 12:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డొనాల్డ్ ట్రంప్(America) రెండవసారి అధ్యక్షుడిగా ఎంపిక అయ్యాక వలసవిధానాలపై ఉక్కుపాదాన్ని మోపారు. నిర్భందంగా అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపిస్తున్నారు. అంతేకాక వీసాలపై కఠిన నిబంధనలు తీసుకొస్తున్నారు. స్వదేశీయులకే తన మొదటి ప్రాధాన్యత అంటూ వీదేశీయుల రాకడను అడ్డుకుంటున్నారు. ఇందులో ఉపాధ్యక్షుడు జేడీవాన్స్, విదేశీ వ్యవహారాల మంత్రి మార్కో రూబియో కూడా ట్రంప్ విధానాలను సమర్థస్తున్నారు. తాజాగా జేడీ వాన్స్ ను ఓ భారతీయ మహిళ పలు ప్రశ్నలను సంధించారు.

Read Also: Pak-Afg: పాక్, ఆఫ్ఘాన్ లమధ్య కాల్పుల విరమణ.. ప్రకటించిన టర్కీ

America:వలసవిధానంపై జేడీ వాన్స్ పై ప్రశ్నల వర్షం కురిపించిన భారత మహిళ

ప్రశ్నలు అడుగుతూనే సవాల్ విసిరిన మహిళ

అమెరికాలోని(America) మిస్సిసిపీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉపాధ్యాక్షుడు జేడీవాన్స్ పాల్గొన్నారు. ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసగింస్తుండగా ఒక భారతీయ మహిళ ఆయనను ప్రశ్నించింది. కఠినమైన వలస వైఖరిపై ప్రశ్నలు అడుగుతూ ఆయనకు సవాల్ చేసింది. ఇండియన్ డ్రెస్ వేసుకుని, బొట్టు పెట్టుకుని వచ్చిన మహిళ వాన్స్ పై నేరుగా ప్రశ్నలను సంధించింది. ట్రంప్ ప్రభుత్వం పాటిస్తున్న కఠినమైన వలస విధానం, వాన్స్ మతాంతర కుటుంబం గురించి ప్రశ్నలను అడిగింది. ట్రంప్ పెట్టిన వలస విధానాన్ని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సమర్థిస్తుండడం మనకు విధితమే. అమెరికాకు చట్టబద్ధమైన వలసలను పరిమితం చేయాలని ఆయన వాదిస్తారు.

ఇప్పుడు ఉన్న దానికంటే తక్కువగా విదేశీయులను రానివ్వాలని వాన్స్(Vance) చెబుతూ వస్తున్నారు. దీనిపైనే భారతీయ మహిళ వాన్స్ ను ప్రశ్నించింది. అమెరికా భారతీయుల కలలను తొక్కేశారని ఆమె ఆరోపించింది. వలసల గురించి కఠిన నిర్ణయాలను ఎందుకు తీసుకున్నారని నేరుగా ఆమె వాన న్ను ప్రశ్నించింది. అమెరికాలో ఉండడానికి మాకు సహాయం చేశారు. ఒక కలను ఇచ్చారు. కానీ దాని కోసం మేం అంతకంటే ఎక్కువ కష్టపడ్డాం.. కానీ ఇప్పుడ పరిస్థితి చూస్తే మా కష్టమంతా వృధా అయిపోతుందని అనిపిస్తోంది అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మాకు మార్గం కల్పించి.. ఇప్పుడు బయటకు పొమ్మని ఎలా చెబుతారు అంటూ సూటిగా ప్రశ్నించింది. అంతేకాక జేడీ వాన్స్ భార్య ఉషావాన్స్ క్రైస్తవురాలిగా మారడంపై కూడా ఆమె ప్రశ్నించారు.

చట్టబద్ధం వచ్చిన వారికి సమస్యలు ఉండవు: వాన్స్

భారతీయ మహిళ అడిగిన ప్రశ్నలకు మొదట నిర్ఘాంతపోయిన వాన్స్ తర్వాత తేరుకుని.. చట్టబద్ధంగా వచ్చిన వారికి తాము ఇప్పటికీ ఆహ్వానిస్తున్నామని..అలాంటి వారికి అమెరికాలో సమస్యలుండవని చెప్పారు. అమెరికా అభివృద్ధికి దోహపడుతున్న భారతీయులను తాము గౌరవిస్తున్నామని చెప్పారు. వాన్స్ తన భార్య ఉషా గురించి మాట్లాడుతూ తన భార్య క్రిస్టియన్ గా మారాలని తాను అనుకుంటున్నానని.. అయతే అది పూర్తిగా ఆమె ఇష్టంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. క్రైస్తవ విలువలు ఈ దేశానికి ముఖ్యమైన పునాది అని నేను ఎప్పటికీ భావిస్తానని..దానికి నేను ఎటువంటి క్షమాపణలు చెప్పనని వాన్స్ పేర్కొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

immigration policy Indian woman Latest News in Telugu Today news US Politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.