📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: America: భారీగా తగ్గిన ఇండియన్ స్టూడెంట్స్ అడ్మిషన్లు

Author Icon By Sushmitha
Updated: November 18, 2025 • 2:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండవసారి ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వలసదారులపై ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. అక్రమ వలసదారులను బలవంతంగా వెనక్కి పంపుతున్నారు. అంతటితో ఆగక హెచ్-1బి వీసాపై కఠిన నిబంధనలను పెట్టారు. విదేశీ విద్యార్థుల రాకను, ఉద్యోగుల రాకను యుద్ధప్రాతిపదికన రాకుండా ట్రంప్ అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యారు. కొత్తగా హెచ్-1బీ (H-1B Visa) వీసాకు లక్షడాలర్ల ఫీజును నియమించారు. దీంతో భారీగా భారతీయ విద్యార్థుల అడ్మిషన్లు తగ్గాయి. అయితే ఈ ప్రభావం ఆదేశంపై తీవ్రంగా చూపిస్తున్నది. నిపుణులైన ఉద్యోగులు తమ దేశానికి కరువు కావడంతో సొంతదేశస్తులే ట్రంప్ ను విమర్శిస్తున్నారు. తాజాగా ట్రంప్ విధానాలవల్ల భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది.

Read Also: Mumbai: గ్యాస్ పైప్ లైన్ పగలడంతో సంక్షోభం లోCNG..

America: Indian students’ admissions drop sharply

20 శాతం మేర తగ్గిన విద్యార్థుల సంఖ్య

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థాలకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో భారత విద్యార్థుల గ్రాడ్యుయేట్ ప్రవేశాలు పదిశాతం మేర తగ్గాయని అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ నిధులతో రూపొందించిన తాజా నివేదిక వెల్లడించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ నిన్న విడుదల చేసిన ‘ఓపెన్ డోర్స్’ నివేదిక ప్రకారం 2025 ఫాల్ సెషన్ లో అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాలు ఏకంగా 17శాతం తగ్గాయి.

వీసా దరఖాస్తుల్లో సమస్యలు

సర్వేలో పాల్గొన్న 825 అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో 61శాతానికి పైగా సంస్థలు భారత విద్యార్థుల నమోదులో క్షీణత కనిపించిందని తెలిపాయి. వీసా దరఖాస్తుల విషయంలో ఎదురవుతున్న సమస్యలు, ప్రయాణ ఆంక్షలే ఈ తగ్గుదలకు ప్రధాన కారణమని 96శాతం యూనివర్సిటీలు అభిప్రాయపడ్డాయి. అయితే, 2024-25లో అమెరికాకు అత్యధిక విదేశీ విద్యార్థులను పంపిన దేశంగా భారత్ ఇప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. మొత్తం విద్యార్థుల సంఖ్యలో 10శాతం పెరుగుదల ఉన్నప్పటికీ, గ్రాడ్యుయేట్ కోర్సుల్లో మాత్రం క్షీణత నమోదైంది.

అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వడమే ధ్యేయం 

ట్రంప్ ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థులపై నిఘా పెంచడం, హెచ్-1బీ వీసాల దుర్వినియోగంపై 170కి పైగా విచారణలు ప్రారంభించడం వంటి చర్యలు ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తున్నాయి. కొత్తగా హెచ్-1బీ దరఖాస్తులకు లక్ష డాలర్ల ఫీజును ప్రతిపాదించడాన్ని వైట్ హౌస్ సమర్ధించింది. ఈ విధానం ద్వారా అమెరికన్ల ఉద్యోగాలను కాపాడగలమన వైట్ హౌస్ ప్రతినిధి టేలర్ రోజర్స్ తెలిపారు. హెచ్ -1బీ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని రిపబ్లికన్ చట్టసభ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

education news. Google News in Telugu Indian students in US international enrollment drop Latest News in Telugu student mobility Telugu News Today US higher education; visa policy impact

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.