ఉగ్రవాద బెదిరింపుల ఆరోపణలపై భారతసంతతికి చెందిన ఓ విద్యార్థిని అమెరికాలోని పోలీసులు అరెస్టు చేశారు. డల్లాస్ లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో సీనియర్ అయిన మనోజ్ సాయి లెల్లాను నాలుగురోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. ఓ కుటుంబ సభ్యులను మనోజ్ సాయి మానసిక హింసించడం, వారి ఇంటికి నిప్పు పెట్టేందుకు యత్నించడం, ప్రార్థన స్థలాన్ని దెబ్బతీసే యత్నం వంటి ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read also: Ukraine: ట్రంప్ తో జెలెన్ స్కీ భేటీకి ముందు కీవ్ లో పేలుళ్లు
America
మనోజ్ సాయి చాలారోజుల క్రితం ఓ కుటుంబానికి చెందిన ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించాడని, ప్రార్థనా స్థలాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దగ్ధం చేసేందుకు ప్రయత్నించాడని అధికారులు చెప్పారు. పలుమార్లు వారిని మానసికంగా హింసించాడని, ఉగ్రవాద (Terrorism) బెదిరింపులకు పాల్పడినట్లుగా పోలీసులు మనోజ్ సాయ్ పై కేసులను నమోదు చేసి, అరెస్టు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: