📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

America: అమెరికాలో భారత సంతతికి చెందిన కుటుంబం రోడ్డుప్రమాదంలో మృతి?

Author Icon By Anusha
Updated: August 3, 2025 • 4:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.న్యూయార్క్ నుంచి వెస్ట్ వర్జీనియాలోని ఒక ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్తూ తప్పిపోయిన న్యూయార్క్‌ (New York) లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు మార్షల్ కౌంటీ షెరీఫ్ మైక్ డౌగెర్టీ అధివారం వెల్లడించారు. బాధితులను 85 ఏళ్ల ఆశా దివాన్, 89 ఏళ్ల కిషోర్ దివాన్, 86 ఏళ్ల శైలేష్ దివాన్, 84 ఏళ్ల గీతా దివాన్‌ల అధికారులు గుర్తించారు. ఈ కుటుంబం 2009 మోడల్‌కు చెందిన లైమ్ గ్రీన్ టయోటా EKW2611 నెంబర్‌ గల వాహనంలో బఫెలో నుంచి పిట్స్‌బర్గ్ మీదుగా వెస్ట్ వర్జీనియా (West Virginia) లోని మార్షల్ కౌంటీలో ఉన్న ‘ప్రభుపాద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్’ అనే ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

America

నలుగురిలో ఇద్దరు

శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో బిగ్ వీలింగ్ క్రీక్ రోడ్డు పక్కన బాధితులు ప్రయాణిస్తున్న వాహనాన్ని గుర్తించినట్టు షెరీఫ్ తెలిపారు. ఆ కుటుంబసభ్యులు జూలై 29న పెన్సిల్వేనియాలోని ఈరీ పట్టణంలో ఉన్న బర్గర్ కింగ్ రెస్టారెంట్ వద్ద చివరి సారిగా కనిపించారని అధికారులు తెలిపారు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా నలుగురిలో ఇద్దరు రెస్టారెంట్ లోపలికి వెళ్లినట్లు స్పష్టంగా తెలుస్తోంది.అంతేకాకుండా వారి చివరి క్రెడిట్ కార్డ్ లావాదేవీ కూడా అదే ప్రదేశంలో జరిగినట్టు అధికారులు గుర్తించారు.బర్గర్‌కింగ్‌ షాప్‌ వద్ద కనిపించిన తర్వాత వీరు ప్రయాణిస్తున్న వాహనం ఐ-79 అనే హైవేపై దక్షిణ దిశగా వెళ్తున్నట్లు పెన్సిల్వేనియా స్టేట్ పోలీస్ లైసెన్స్ ప్లేట్ రీడర్ ద్వారా అధికారులు గుర్తించారు. కానీ ఈ కుటుంబ తాము చేరుకోవాల్సిన గమన్యాన్ని చేరుకోలేదని అధికారులు తెలిపారు. మౌండ్స్‌విల్లే, వీలింగ్ ప్రాంతాలలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల వారి ఫోన్‌లు స్విచ్ఛాఫ్ అయ్యాయని అధికారులు తెలిపారు.

అమెరికా జనాభా ఎంత?

అమెరికా జనాభా 34 కోట్లు.

అమెరికా ఎన్ని చదరపు కిలోమీటర్లు?

అమెరికా సంయుక్త రాష్ట్రాలు (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా) సుమారు 9.8 మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఇది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశం.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/russia-another-earthquake-in-russia/international/525249/

Breaking News Indian family dies in US Indian origin family killed latest news Marshall County crash New York to West Virginia accident Prabhupada Palace of Gold tragedy Telugu News US road accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.