📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు

America: చెప్పినట్లు వినకపోతే నీకూ మదురో గతి పడుతుంది: ట్రంప్

Author Icon By Rajitha
Updated: January 5, 2026 • 12:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య అమెరికా సైన్యం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శనివారం తెల్లవారుజమున పెద్ద ఎత్తున సైనిక దాడి చేసి మదురోను అదుపులోకి తీసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఉద్రిక్తగా మారాయి. ప్రపంచదేశాలన్ని ఈ హఠాత్తు పరిణామాలకు నివ్వెరపోయాయి. ఇంకా ఈ షాక్ నుంచి తేరుకోకముందే వెనిజులా అధ్యక్షుడు మదురో ఆయన భార్యను అదుపులో తీసుకుని, వెనిజులా వెలుపలికి వారిని తీసుకొచ్చారు. అంతేకాక ట్రంప్ (Trump) వెనిజులా ప్రజలతో కలిసి పనిచేస్తామని, ఆ దేశప్రజల యోగక్షేమాలే తమకు ముఖ్యమని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇక నికోలస్ మదురోను అమెరికాకు తీసుకెళ్లిపోవడంతో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోనరడిస్ట్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టగానే ఆమెరికా చర్యలను ఆమె తప్పుపట్టారు. మదురోను నిర్బంధించడం సరికాదని, వెంటనే విడిచిపెట్టాలని ఆమె డిమాంద్ చేశారు.

Read also: Monkeys: చైనాలో కోతులకు పెరుగుతున్న డిమాండ్‌.. కారణాలేంటి?

మదురో కంటే ఘోరమైన గతి పడుతుంది

తాజాగా ఇదే అంశంపై ట్రంప్ స్పందించారు. వెనిజులా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అమెరికా చేయాలనుకుంటున్న పనులను చేసేందుకు డెల్సీ రోడ్రిగ్ సుముఖంగా ఉండాలన్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఆమె సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మదురో కంటే ఘోరమైన గతి పడుతుందన్నారు. వెనిజులాపై అమెరికా నియంత్రణకు అంగీకరించాల్సిందేనని.. అప్పుడే ఆ దేశాన్ని పునర్నిర్మించగలమని చెప్పారు. తాము చెప్పినట్లు చేస్తే వెనిజులాలో అమెరికా దళాలు మోహరించబోవు అని ట్రంప్ తేల్చిచెప్పారు. వెనిజులా దేశప్రజలకు ఏం కావాలో తమకు తెలుసని, వారితో కలిసి పనిచేస్తామని ట్రంప్ ప్రకటించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

donald trump warning latest news Nicolas Maduro arrest Telugu News Venezuela Crisis

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.