Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ ఆచూకీ పై భారీ రివార్డు ప్రకటించిన అమెరికా

Read Time:  1 min
Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ ఆచూకీ పై భారీ రివార్డు ప్రకటించిన అమెరికా
FONT SIZE
GET APP

Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజాబా ఖమేనీ ఆచూకీ తెలిపిన వారికి అమెరికా విదేశాంగ శాఖ 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ.93 కోట్లు) భారీ రివార్డును ప్రకటించింది. యూఎస్ విదేశాంగ శాఖకు చెందిన ‘రివార్డ్స్ ఫర్ జస్టిస్’ (Rewards for Justice) ప్రోగ్రాం ద్వారా ఈ ప్రకటన వెలువడింది. మొజాబాతో పాటు ఆయన కార్యాలయ డిప్యూటీ చీఫ్ అలీ అస్గర్ హెజాజీ, భద్రతాధికారి అలీ లారిజాని వంటి కీలక నేతల సమాచారం కోసం కూడా అమెరికా గాలిస్తోంది.

Read Also: Iran vs USA: రష్యా చమురు కొనాలని ట్రంప్ ఒత్తిడి..అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్

ఉగ్రవాద ఆరోపణలు.. పునరావాస ఆఫర్

సుప్రీం నేత ఖమేనీ (Mojtaba Khamenei) తో పాటు, ఆయన కార్యాలయ డిప్యూటి చీఫ్ అలీ అస్గర్ హెజాజీ, ఇరాన్ భద్రతాధికారి అలీ లారిజాని సహా పలువురి పేర్లను యూఎస్ విదేశాంగశాఖ ప్రస్తావించింది. వీరు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నారని ఆరోపించింది. వీరికి సంబంధించిన సమాచారం ఉంటే ఎన్ క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ లేదా టోర్ నెట్వర్క్ ద్వారా తెలియజేయాలని పేర్కొంది. ఇందుకు గాను తగిన బహుమతి అందిస్తామని తెలిపింది.

America has announced a huge reward for the whereabouts of Mojtaba Khamenei
America has announced a huge reward for the whereabouts of Mojtaba Khamenei

సమాచారం అందించిన వారికి పునరావాసం కల్పించనున్నట్లు కూడా వెల్లడించింది. ఇక, అమెరికా- ఇజ్రాయెల్ తొలిరోజు జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన వారసుడిగా మొల్తాబా ఎన్నికయ్యారు. యుద్ధం నేపథ్యంలో మొజాబా ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు. ఆయన ఎక్కడున్నారనే విషయంపై స్పష్టత లేదు.

రహస్య మార్గాల ద్వారా సమాచారం..

ఈ సమాచారాన్ని అందించాలనుకునే వారు ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లు లేదా అత్యంత సురక్షితమైన ‘టోర్’ నెట్‌వర్క్ ద్వారా సంప్రదించాలని అధికారులు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. చూడాలి మరి అమెరికా ఇచ్చిన ఆ ఆఫర్‌ను ఎవరైనా ఉపయోగించుకుని.. ఇరాన్ అగ్రనేతల సమాచారం అందిస్తారా లేదా అనేది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.