అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) నేతృత్వంలోని ప్రభుత్వం ఈనెల 15వ తేదీ నుంచి కొత్తగా సోషల్ మీడియా(America) వెట్టింగ్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. దీనివల్ల భారతీయ హెచ్-1బీ వీసాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కొత్త నిబంధనల కారణంగా వీసా ఇంటర్వ్యూలు చాలా ఆలస్యం కావడంతో ఇప్పుడు మనదేశంలో ఉన్న చాలామందికి అక్టోబర్ 2026 వరకు అపాయింట్మెంట్లు రీషెడ్యూల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే భారతీయులకు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా భారత్ లో చిక్కుకున్న వారు తమ ఉద్యోగాన్ని కోల్పోకుండా చూసుకోవాలని పేర్కొంటున్నారు. ఎందుకంటే కొత్త నిబంధనల ప్రకారం అమెరికా బయట ఉన్న వ్యక్తికి కొత్త వీసా రావడం దాదాపు అసాధ్యమని చెబుతున్నారు.
Read also: America: హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన
ఉద్యోగాన్ని కాపాడుకోండి
హెచ్-1బీ వీసాదారులకు ప్రముఖ ఇమ్మిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమాన్ ఒక కీలక సలహా ఇచ్చారు. (America) ప్రస్తుతం భారత్ లో ఉండి, వీసా అపాయింట్మెంట్లు కనీసం 6నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం వాయిదా పడిన వారు వారికి ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఎందుకంటే ట్రంప్ తెచ్చిన కొత్త రూల్స్ ప్రకారం అమెరికా బయట ఉన్న వ్యక్తి కోసం ఒక కంపెనీ కొత్త హెచ్-1బీ జారీ చేయాలంటే లక్ష డాలర్లు అంటే సుమారు రూ. 90లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించి కొత్తగా ఎవరినీ నియమింఉకోవడానికి అమెరికాలోని కంపెనీలు సిద్ధంగా లేవు. దీంతో హెచ్-1బీ వీసా అపాయింట్ మెంట్ ఆలస్యం అయి ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం పోతే వేరే కంపెనీలో చేరి తిరిగి ఆమెరికా వెళ్లడం దాదాపు అసాధ్యం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. లాంగ్ లీవ్ కంపెనీల నుంచి తీసుకోవాలని లేదా ఇంటి నుంచి పనిచేసేలా అనుమతి తీసుకోవాలని సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: