📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: America: హెచ్-1బీ వీసా.. ఐటీ కంపెనీలకు 70శాతం మేర తగ్గింపు

Author Icon By Sushmitha
Updated: December 2, 2025 • 5:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండోసారి ఎన్నికైన రోజునుంచే వలసదారులపై ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. వీదేశీయుల రాకను ఘననీయంగా తగ్గించేందుకు ఆయన పలు సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఒకవైపు అమెరికాకు భారతీయ నిపుణుల అవసరం ఉందంటూనే మరోవైపు వారి రాకడను అడ్డుకుంటున్నారు. అక్కడి కంపెనీలు ప్రతిభగల ఉద్యోగుల కొరతతో అల్లాడుతుంటే ట్రంప్ మాత్రం తన పంతం వీడడం లేదు. హెచ్-1బీ వీసా తీసుకొనిచ్చిన కొత్త నిబంధనలు, అధిక ఫీజుతో భారతీయుల కొంప ముంచుతోంది. 

Read Also: Ukraine: సవరణల తర్వాతే శాంతి ప్రణాళిక: జెలెన్ స్కీ

అమెరికా (America) వెళ్లాలనుకునే వాళ్ల కలలు కల్లలు చేస్తోంది. చదువు, ఉద్యోగంతో పాటు చివరకు పర్యాటకం కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. ఒక్క హెచ్-1బీ వీసా (H-1B visa) మాత్రమే కాకుండా దాదాపుగా అన్ని రకాల వీసాలకు చెల్లించాల్సిన ఫీజులు భారంగా పరిణమించాయి. ఫీజులు పెంచిన తర్వాత రెండు నెలల కాలంలోనే వీసా దరఖాస్తులు సగానికి పైగా పడిపోయినట్లు నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్ ఎఫ్ఎపి) వెల్లడించింది.

America H-1B visa.. 70 percent discount for IT companies

4,573 వీసాలు మాత్రమే మంజూరు 

2025 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఐటీ కంపెనీలకు హెచ్-1బీ వీసాల ఆమోదాలు 70 శాతం మేర తగ్గిపోయాయంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్ ఎఫ్ఎపి విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రారంభ నియామకాల కోసం ఏడు భారతీయ ఐటీ సంస్థలకు 4,573 వీసాలు మాత్రమే మంజూరు అయ్యాయి. ఇది 2015తో పోలిస్తే 70 శాతం మేర తగ్గింది. 2024తో పోలిస్తే 37శాతం క్షీణత కనిపించింది. లక్ష డాలర్ల మేర హెచ్-1బీ వీసా ఫీజు పెంపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి కారణం.

టాప్ 5 భారతీయ సంస్థల్లో టిసిఎస్ ఒక్కటే నిలిచింది.

హెచ్-1బీ అప్రూవల్స్ లల్లో టాప్ 5 భారతీయ సంస్థల్లో టిసిఎస్ ఒక్కటే నిలిచింది. జాబ్ ఓపెనింగ్స్ తో పాటు ఇప్పుడు ఉద్యోగాల కోసం 7,293 అప్రూవల్స్ పొందింది. టీసీఎస్ రిజెక్ట్ రేటు 2024 కంటే ఈసారి భారీగా పెరిగింది. గత ఏడాది ఈ రేటు నాలుగు శాతం ఉంటే ఇప్పుడది ఏడుకు పెరిగింది. అప్రూవల్స్ కోసం టీసీఎస్ పంపించిన దరఖాస్తులు గతంలో నాలుగు శాతం వరకే రిజెక్ట్ అయ్యేవి. ఇప్పుడు ఏడు శాతం మేర తిరస్కరణకు గురి అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే కొనసాగుతున్న ఉద్యోగాల కోసం హెచ్-1బీ వీసా పిటిషన్ల తిరస్కరణ రేటు 1.9శాతం. గత ఏడాది ఇది 1.8గా ఉండేది. ఈ ఏడాది టీసీఎస్ కు ప్రారంభ ఉద్యోగాల కోసం కేవలం 846 ఆమోదాలు మాత్రమే లభించాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

70PercentCut America Google News in Telugu H1BVisa ImmigrationNews ITCompanies Latest News in Telugu Telugu News Today USImmigration VisaPolicy VisaReduction

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.