📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: America: గుడ్ న్యూస్.. ప్రారంభమైన ఫ్లాగ్ సేవలు

Author Icon By Aanusha
Updated: November 2, 2025 • 5:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా (America) లో ఉద్యోగాలు చేయాలనుకునే విదేశీ ప్రొఫెషనల్స్‌కి ట్రంప్ ప్రభుత్వం మంచి శుభవార్త అందించింది. కొంతకాలంగా నిలిపివేసిన ఫారిన్ లేబర్ అప్లికేషన్ గేట్‌వే (FLAG) సిస్టమ్ను మళ్లీ ప్రారంభించినట్లు అమెరికా ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ (OFLC) కార్యాలయం ప్రకటించింది.

Read Also: England: రైలులో కత్తి దాడి కలకలం – 10 మంది గాయాలు, ఇద్దరు అరెస్ట్

ఈ వ్యవస్థ మళ్లీ ప్రారంభం కావడంతో.. కంపెనీలు ఇదివరకు చేసిన దరఖాస్తుల స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. కొత్తగా వీసాల కోసం అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా హెచ్1బీతో పాటు ఇతర వీసాలతో ఉద్యోగాలు పొందాలనుకుంటున్నవారికి మంచి పరిణామమే అని చెప్పొచ్చు.అమెరికాలో పని చేయాలంటే లేబర్ సర్టిఫికెట్లు ఉండాలి.

ఉద్యోగం పొందే ప్రక్రియలో ఈ సర్టిఫికెట్ పొందడం ఒక స్టెప్‌. దీన్ని OFLC నిర్వహిస్తుంది. H-1B, H-2A, H-2B, PERM వీసా ప్రోగ్రామ్‌ల కింద విదేశీ వర్కర్లను నియమించుకోవాలంటే అమెరికాలోని కంపెనీలు ఈ స్టెప్‌ను దాటాలి. అయితే FLAG అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

America

యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్

OFLC సర్టిఫికెట్ ఉంటేనే.. యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) వద్ద హెచ్1బీ లాంటి వీసా పిటిషన్లు వేసుకోవడానికి వీలు కలుగుతుంది. లేకుంటే.. వీసా ప్రాసెస్ ముందుకు కదలదు. కాగా, విదేశీ టెక్ నిపుణల కోసం ఇచ్చేది హెచ్1బీ వీసా.

ఇక తాత్కాలిక వ్యవసాయ రంగంలో ఉద్యోగాల కోసం H-2A వీసా ఇస్తారు. ఇతర రంగాల్లో తాత్కాలిక ఉద్యోగాల కోసం H-2B వీసా ఇస్తారు. PERM అంటే శాశ్వత ఉద్యోగాల కోసం ఇచ్చే వీసా.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

FLAG system H1B visa H2A visa H2B visa latest news PERM certification Telugu News USA jobs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.