అమెరికా (America) లో ఉద్యోగాలు చేయాలనుకునే విదేశీ ప్రొఫెషనల్స్‌కి ట్రంప్ ప్రభుత్వం మంచి శుభవార్త అందించింది. కొంతకాలంగా నిలిపివేసిన ఫారిన్ లేబర్ అప్లికేషన్ గేట్‌వే (FLAG) సిస్టమ్ను మళ్లీ ప్రారంభించినట్లు అమెరికా ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ (OFLC) కార్యాలయం ప్రకటించింది.
Read Also: England: రైలులో కత్తి దాడి కలకలం – 10 మంది గాయాలు, ఇద్దరు అరెస్ట్
ఈ వ్యవస్థ మళ్లీ ప్రారంభం కావడంతో.. కంపెనీలు ఇదివరకు చేసిన దరఖాస్తుల స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. కొత్తగా వీసాల కోసం అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా హెచ్1బీతో పాటు ఇతర వీసాలతో ఉద్యోగాలు పొందాలనుకుంటున్నవారికి మంచి పరిణామమే అని చెప్పొచ్చు.అమెరికాలో పని చేయాలంటే లేబర్ సర్టిఫికెట్లు ఉండాలి.
ఉద్యోగం పొందే ప్రక్రియలో ఈ సర్టిఫికెట్ పొందడం ఒక స్టెప్. దీన్ని OFLC నిర్వహిస్తుంది. H-1B, H-2A, H-2B, PERM వీసా ప్రోగ్రామ్‌ల కింద విదేశీ వర్కర్లను నియమించుకోవాలంటే అమెరికాలోని కంపెనీలు ఈ స్టెప్‌ను దాటాలి. అయితే FLAG అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్
OFLC సర్టిఫికెట్ ఉంటేనే.. యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) వద్ద హెచ్1బీ లాంటి వీసా పిటిషన్లు వేసుకోవడానికి వీలు కలుగుతుంది. లేకుంటే.. వీసా ప్రాసెస్ ముందుకు కదలదు. కాగా, విదేశీ టెక్ నిపుణల కోసం ఇచ్చేది హెచ్1బీ వీసా.
ఇక తాత్కాలిక వ్యవసాయ రంగంలో ఉద్యోగాల కోసం H-2A వీసా ఇస్తారు. ఇతర రంగాల్లో తాత్కాలిక ఉద్యోగాల కోసం H-2B వీసా ఇస్తారు. PERM అంటే శాశ్వత ఉద్యోగాల కోసం ఇచ్చే వీసా.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: