ప్ర పంచ దేశాలకు అమెరికా గ్రోత్ ఇంజన్ అయితే ఆ ఇంజన్ నడుపుతున్నది ఎవరు? ఇతర దేశాలపై ఆధా రపడే అమెరికా ఆర్థిక వ్యవస్థ మానవ వనరులు, సాంకేతిక నైపుణ్యం, వాణిజ్యం పెట్టుబడి వ్యూహాత్మక విదేశీ సంబం ధాల ద్వారా తన ఆర్థిక వ్యవస్థ నిలబెట్టుకోవడానికి బలోపే తం చేయడానికి అమెరికా (America)అనేకదేశాలపై ఆధారపడిఉన్నది. సాఫ్ట్వేర్ ఆరోగ్య సంరక్షణ ఇంజనీరింగ్ పరిశోధన ఆవిష్కర ణలో భారతీయ నిపుణులో అమెరికాలో కీలక పాత్ర పోషి స్తున్నారు తయారీ సరఫరా గొలుసులు అరుదైన వినియోగ వస్తువుల ద్వారా అమెరికా ఆర్థిక పనితీరుకు చైనా చాలా కాలంగా కేంద్రంగా ఉంది. వ్యవసాయం శ్రమ సరిహద్దు సరఫరా గొలుసుల ద్వారా అమెరికా
-వ్యవస్థకుమెక్సికో మద్దతు ఇస్తోంది. కెనడా ఇంధన భద్రత, చమురు గ్యాస్ విద్యుత్తు, ఖనిజాలు, వాణిజ్యానికి చాలా ముఖ్యమైనది. జర్మనీ యూరోపియన్ యూనియన్అధునాతన సాంకేతిక యంత్రాలు ఆటోమొబైల్స్ ఫార్మాక్యుటికల్స్ ఆర్థిక పెట్టుబ డులను అందిస్తాయి. జపాన్ దక్షిణ కొరియా సెమీకండక్టర్లు ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ చోబోటిక్స్ పారిశ్రామిక సాంకేతిక కీలకమైనవి. సౌదీ అరేబియా యూఏఈ ఖతార్ వంటిమధ్య ప్రాచ్యా దేశాలు చమురు గ్యాస్ ఇంధన మార్కెటి నియంత్రణ ద్వారా అమెరికా (America) ఆర్థిక స్థిరత్వానికి మద్దతిస్తాయి. ఇజ్రాయిల్ రక్షణ సాంకేతికత సైబర్ భద్రత ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరణ, పర్యావరణ వ్యవస్థలకు గణనీయంగా దోహద పడుతోంది.
ఆఫ్రికన్ లాటిన్ అమెరికన్ దేశాలు కీలకమైన ఖనిజాలు ముడి పదార్థాలు వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధి చెందుతున్న మార్కెట్లను సరఫరా చేస్తాయి. మొత్తం మీద అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచ వ్యవస్థతో లోతుగా పరస్పరం ఆధారపడి ఉంది. ఇలా అనేక దేశాలు అమెరికా ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంటే ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం అమెరికా ప్రపంచ దేశాలకు గ్రోత్ ఇంజనని ప్రగల్బాలు పలకడం ఏంటి? ఆర్థిక అభివృద్ధి పరంగానే కాకుండా రక్షణ పరంగా కూడా అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా ఇతర దేశాలపై ఆధారపడుతున్నది.
Read Also: US: భారత్ కు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్
సైనిక నిఘా మద్దతు కోసం అమెరికా సాధారణంగా ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ సభ్యులు యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ కెనడాతో పాటు జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్ వంటి మిత్ర దేశాలపై ఆధారపడుతుంది. ఇప్పుడు చైనాపై ఆధారపడి ఉంది. పెంటగాన్ వ్యయం ఏడాది వన్ ట్రిలియన్ డాలర్నుం చి 1.5 ట్రిలియన్ డాలర్లకు అంటే అమాంతంగా 50 శాతం ఒకేసారి పెంచనున్నట్లు ట్రంప్ జనవరి 7న ప్రకటిం చారు. ఇది దాదాపు 135 లక్షల కోట్లకు సమానం. ముఖ్యంగా చమరు గ్యాస్ ఖనిజాలు లేదా వ్యూహాత్మక వాణిజ్యమార్గాల సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో ప్రజాస్వామ్యం భద్రతా లేదా మానవ హక్కులను ప్రోత్సహించడానికి చర్యల పేరుతో అమెరికా సైనిక జోక్యాలు తరచుగా స్వార్థపూరిత ప్రయోజ నాలను కలిగి ఉంటాయి. మధ్యప్రాచ్యంలో ముఖ్యంగా లిబియాలో జోక్యాలను తరచూ
చూస్తున్నాము. ఇంధన వనరుల వ్యూహాత్మక ప్రభావం అమెరికా ఆర్థిక, కార్పొరేట్ ప్రయోజనాలకు దగ్గరగా ఉంటాయి. అలా కాకుండా చైనా లో అయితే ప్రభుత్వ నియంత్రణలో రక్షణ వ్యవహారాలన్నీ ఉంటాయి. అమెరికా తన సైనిక పాఠవాన్ని పూర్తిగా ప్రైవేట్ కరించింది. 1993 నాటిక ఆ దేశపు సైనికరణ కార్యక్రమం లో 74కేవలం ఐదు ఆరుగురు కాంట్రాక్టర్లకు అప్పజెప్పడం జరిగింది. వాళ్లే సరఫరాదారులుగా ఉన్నారు. విపరీతంగా లాభాలు పోగేసుకుంటున్నారు. అమెరికా అనేక దేశాలపై పడి దోపిడీ చేయకుంటే ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ మనుగడే కష్టమవుతుంది. ప్రపంచంలో పెట్టుబడిదారీ విధా నాలకు అనుగుణంగాలేని ప్రభుత్వాలను అమెరికా నేడు తన వలస వాదనతో దోచుకునేందుకు పూనుకుంటాంది. సుంకాల పేరుతో దేశాలను ఎంత బెదిరిస్తుందో చూస్తున్నా ము. మన దేశ విషయానికొస్తే ప్రతి ఏటా లక్షలాది మంది మేధావులు డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్ట్లో భారత్ నుండి వలసపోతున్నారు వీరి చదువుల కోసం భారత్ వేల కోట్లు ఖర్చు చేస్తోంది. వీరి సేవలు మాత్రం ముఖ్యంగా అమెరికా ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నది. మనదేశంలో వీరికి సరైన ఉపాధి అవకాశాలు లేక ప్రభుత్వం ద్వారా పెట్టుబ డుల సహాయం లేక వారు అమెరికాకు పోవాల్సి వస్తున్నది. అక్కడ సంపాదించింది వారు ఇండియాకు పంపించినా అవి ఈ దేశానికి ఉపయోగపడే పెట్టుబడి రూపంలో రూపుదాల్చ డం లేదు. పెట్టుబడులుగా మార్చే పథకాలు ప్రభుత్వాలు కల్పించాలి. మన దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందిన దేశంగా అవుతుందో చెప్పగలమా? మన యువత నైపుణ్యమంతా అమెరికా ప్రయోజనాల కోసం అన్నట్లుగా ఉంది.
-డాక్టర్ ఎనుగొండ నాగరాజ నాయుడు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: