దివంగత జాన్ ఎఫ్. కెన్నెడీ అమెరికా మాజీ అధ్యక్షుడిగా ప్రపంచానికి సుపరిచితమే. రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను వేసుకున్న కెన్నెడీ ఆదర్శ నాయకుడిగా పేరొందారు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. ఎన్నో ఆదర్శవంతమైన నిర్ణయాలను ఆయన తన కాలంలో తీసుకున్నారు. ఇలాంటి నేత మనవరాలు టటియానా ష్లోస్ బర్గ్(35) హఠాన్మరణం చెందారు. చిన్నవయసులోనే ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణాన్ని జేఎఫ్ కే లైబ్రరీ ఫౌండేషన్ ధృవీకరించింది. తీవ్రమైన మైలోయిడ్ లుకేమియాతో (Leukemia) చనిపోయినట్లుగా పేర్కొంది. రెండవ బడ్డకు జన్మనిచ్చిన తర్వాత మే 2024లో తీవ్రమైన మైలోయిడ్ లేకేమియా ఉన్నట్లు నిర్ధారణ అయింది.
Read also: Saudi Yemen strike : సౌదీ దాడితో యెమెన్‌లో ఉద్రిక్తతలు
America
పర్యావరణ జర్నలిస్ట్ గా కెరీర్ ఆరంభం
ప్లోస్ బర్గ్ కు భర్త జార్జ్ మోరన్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. న్యూయార్క్ నగరంలో పుట్టి పెరిగింది. కరోలిన్ కెన్నెడీ-ఎడ్విన్ ష్లోస్ బర్గ్ దంపతులకు జన్మించింది. జాకీ-జాన్ ఎఫ్. కెన్నెడీల మనవరాలు. యేల్ విశ్వవిద్యాలయం, ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలైంది. పర్యావరణ సమస్యలు, వాతావరణ మార్పు, సైన్స్ జర్నలిజంపై విద్యను అభ్యసించింది. పర్యావరణ జర్నలిస్టిగా, రచయిత్రిగా కెరీర్ ప్రారంభించింది. ది న్యూయార్క్ టైమ్స్ లో సైన్స్, క్లైమేట్ రిపోర్టర్ గా పనిచేశారు. కెరీర్ లో ది వాషింగ్టన్ పోస్ట్, వానిటీ ఫెయిర్, ది అట్లాంటిక్, బ్లూమ్ బెర్గ్ కు వార్తలు అందించారు. వృత్తిపరంగా భిన్నమైన వృత్తిని ఎంచుకుని, తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్రను టటియానా ష్లోస్ బర్గ్ పొందారు. పర్యావరణంపై విపరీతమైన ఆసక్తితో జర్నలిజం విద్యను అభ్యసించి, ప్రకృతిపై పలు వ్యాసాలను రాశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: