అమెరికాలో(America) నివసిస్తున్న వలసదారులు ప్రస్తుతం ప్రయాణాల విషయంలో తీవ్రమైన అనిశ్చితి, భయంతో జీవిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వ హయాంలో ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేయడంతో భద్రతా సంస్థల నిఘా గణనీయంగా పెరిగింది. దీని ప్రభావంగా సుమారు 27 శాతం మంది గ్రీన్ కార్డ్ హోల్డర్లు, ఇతర ఇమిగ్రెంట్లు తమ ప్రయాణ ప్రణాళికలను స్వచ్ఛందంగా రద్దు చేసుకున్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి.
Read Also: Bangladesh: ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
విదేశీ ప్రయాణాలే కాదు, అమెరికా లోపలే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లడానికీ చాలామంది వెనకడుగు వేస్తున్నారు. విమానాశ్రయాలు, బస్ టెర్మినల్స్, రైల్వే స్టేషన్లలో తనిఖీలు కఠినంగా మారడం, ప్రయాణికుల వివరాలు ICE అధికారులకు చేరుతున్నాయనే భయం వలసదారుల్లో ఆందోళనను మరింత పెంచుతోంది.
ప్రత్యేకంగా వీసా స్టేటస్‌పై (America)సందేహాలు, పాత కేసులు లేదా చిన్నపాటి డాక్యుమెంటేషన్ లోపాలు ఉన్నవారు ప్రయాణానికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఈ భయం అక్రమంగా ఉన్న వలసదారులకే పరిమితం కాకుండా, చట్టబద్ధంగా ఉద్యోగాలు చేస్తున్న H-1B వీసా హోల్డర్లు కూడా రిస్క్ తీసుకోవడం లేదని వలస సంఘాలు చెబుతున్నాయి.
దీని వల్ల కుటుంబ కార్యక్రమాలు, ఉద్యోగ సంబంధిత ట్రిప్పులు, విద్యా అవసరాల కోసం చేయాల్సిన ప్రయాణాలు కూడా వాయిదా పడుతున్నాయి. వలసదారుల మానసిక ఆరోగ్యంపై కూడా ఈ పరిస్థితి ప్రభావం చూపుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలోని ఇమిగ్రేషన్ విధానాల్లో స్పష్టత వచ్చే వరకు ఈ భయం కొనసాగుతుందని వారు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: