📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

America: హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

Author Icon By Anusha
Updated: December 18, 2025 • 3:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి


అమెరికా (America) అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేసిన నాటినుంచి వలసదారులకు చుక్కలు చూపిస్తున్నారు. కఠినమైన నిబంధనలను విధిస్తూ, విదేశీయుల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తున్నారు. హెచ్-1B వీసాదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వలసలపై మరింత కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. ముఖ్యంగా హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని కట్టడి చేయడం లేదా దశలవారీగా తగ్గించే దిశగా ట్రంప్ పరిపాలన అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇందులో భాగంగానే మొదటిగా హెచ్-1బీ వీసాలపై అమెరికన్ (America) కంపెనీలు ఏటా లక్ష డాలర్ల ఫీజు చెల్లించాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఇప్పటికే ఉన్న హెచ్-1బీ వీసాదారులకు ఇది వర్తించదని, కొత్తగా హెచ్-1బీ వీసాలు పొందే అభ్యర్థులకు మాత్రమే ఈ ఫీజు అమలులోకి వస్తుందని ట్రంప్ ప్రభుత్వం స్పష్టంఇచ్చింది.

Read Also: Oman: భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

మరో కీలక నిర్ణయం

ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ట్రంప్ ప్రభుత్వం. సోషల్ మీడియా తనిఖీలను మరింత కఠినతరం చేస్తూ, భారత్ లో జరిగే హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూలను రెండునెలల పాటువాయిదా వేస్తున్నట్లు అమెరికా అధికారులు ప్రకటించారు. దీంతో ఇప్పటికే వీసా అపాయింట్మెంట్ల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న వేలాదిమంది భారతీయులకు ఇది పెద్ద షాక్ గా మారింది.

భారత్ లో చిక్కుకుపోయిన భారతీయులు

ఇదే సమయంలో కొంతమంది అభ్యర్థులు ప్రస్తుత హెచ్-1బీ వీసాలను కూడా తాత్కాలికంగా రద్దు చేసే నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభమైంది. ఫలితంగా వీసా ఇంటర్వ్యూల కోసం భారత్ కు వచ్చి అపాయింట్మెంట్లు రద్దవడంతో ఇక్కడే చిక్కుకుపోయిన భారతీయుల పరిస్థితి రోజురోజుకు ఆందోళనకరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్ లో చిక్కుకున్న హెచ్-1బీ వీసాదారులే అమెరికా నుంచి రానున్న తమ సాటి భారతీయులను వచ్చే రెండునెలల పాటు వీసా ఇంటర్వ్యూల కోసం అపాయింట్మెంట్లు బుక్ చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

America: Expert advice for employees in India who cannot get H-1B visas

కీలక సూచనలు

ఈ నేపథ్యంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్-1బీ వీసాదారులకు కీలక సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా, ఈ దశలో తమ ఉద్యోగాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పోకుండా కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని వారు సూచిస్తున్నారు. వీసా అపాయింట్మెంట్లు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో సాధ్యమైనంతవరకు యజమానితో మాట్లాడి వర్క్ ఫ్రమ్ హోం అనుమతి తీసుకోవాలని, లేకపోతే ఎమర్జెన్సీ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగం కోల్పోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది.

స్టాంపింగ్ కోసం ఈ సమయంలో భారత్ కు ప్రయాణించవద్దు

ఒకవేళ హెచ్-1బీ ఉద్యోగాన్ని కోల్పోయిన తర్వాత జూన్ లేదా జూలైలో కొత్త ఉద్యోగం దొరికినా, ఆ కంపెనీ కొత్తగా హెచ్-1బీ పిటిషన్ వేయాల్సి వస్తుంది. అప్పుడు అమెరికన్ కంపెనీలు ఏడాదికి లక్ష డాలర్ల వీసా ఫీజు చెల్లించాల్సి వస్తుందని.. ఈ భారీ భారంమోయడానికి చాలా సంస్థలు సిద్ధంగా లేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రస్తుతంవీసా పొడిగింపు లేదా స్టాంపింగ్ కోసం ఈ సమయంలో భారత్ కు ప్రయాణించవద్దని సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

H1B job security H1B visa holders latest news Telugu News US immigration advice Visa appointment delays

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.