📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

America: డోంట్ వర్రీ – అమెరికాకు ప్రత్యామ్నాయ దేశాలు ఇవే

Author Icon By Sharanya
Updated: June 21, 2025 • 1:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

America: అమెరికా ఇది ఎన్నో సంవత్సరాలుగా భారతీయ విద్యార్థుల కలల దేశం. ఉన్నత విద్య, నాణ్యమైన అవకాశాలు, పాఠశాలలు, పరిశోధనా సంస్థలు, ఉద్యోగ అవకాశాల పరంగా ఎంతో మంది విద్యార్థుల గమ్యస్థానం. అయితే, ఇటీవల అమెరికాలో (America) విద్యార్థి వీసాలపై కొనసాగుతున్న అనిశ్చితి, పునఃస్థాపిత ట్రంప్ పాలనలో తీసుకుంటున్న కఠిన చర్యల నేపథ్యంలో విద్యార్థుల ఆత్మవిశ్వాసం కుదేలవుతోంది. దీంతో వారి దృష్టి ఇతర దేశాలవైపు మళ్లింది.

అమెరికాలో వీసా సమస్యలు – విద్యార్థుల ఆందోళన

డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా రంగంపై పలు పరిమితులను విధించటం ప్రారంభించారు. ముఖ్యంగా విద్యార్థి వీసాల చుట్టూ అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా F1 వీసాలు (విద్యార్థుల వీసాలు), H1B వీసాలు (ఉద్యోగావకాశాలు) విషయంలో అనేక ఆంక్షలు, ఆలస్యం, తిరస్కరణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వేలాదిమంది భారతీయ విద్యార్థుల కల చెదిరిపోతోంది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారే కాకుండా ఇప్పటికే అక్కడి యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల ప్రణాళికలను సైతం ట్రంప్‌ నిర్ణయాలు దెబ్బతీస్తున్నాయి. మొత్తంగా అమెరికా వెళ్లాలనుకునే వారికి ప్రస్తుత పరిస్థితులు కఠినంగా మారాయి. దీంతో విద్యార్థులు ఇతర దేశాలవైపు చూస్తున్నారు.

భారతీయ విద్యార్థుల కొత్త లక్ష్యదేశాలు

జర్మనీ, రష్యా, హాంకాంగ్‌, యూకే, యూరప్‌, ఆస్ట్రేలియా వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. హాంకాంగ్‌ సహా పలు దేశాల్లో స్కాలర్‌షిప్‌తో పాటు ఆర్థిక సాయం కూడా అందడంతో అమెరికా వెళ్లాలన్న ఆలోచనను విరుచుకుంటున్నారు. ట్యూషన్ ఫీజు తక్కువగా ఉండటం, ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఉచిత విద్య అందుబాటులో ఉండటం ప్రధాన ఆకర్షణలు. సింగపూర్, దుబాయ్ వంటి ఆర్థిక కేంద్రాల్లో గ్లోబల్ విద్యా సంస్థల శాఖలు ఏర్పడిన కారణంగా విద్యార్థులకు కొత్త అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.

విద్యార్థుల భద్రత, మనశ్శాంతి ముఖ్యమంటున్నారు. అందుకే మాకొద్దీ అమెరికా అనే పరిస్థితికొచ్చినట్లు పలు సర్వేలు కూడా చెబుతున్నాయి. అయితే అమెరికాలో ఈ సమస్యలు తాత్కాలికమేనని, త్వరలోనే అంతా సర్దుకుంటుందని పలువురు నిపుణులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. విద్యార్థుల భద్రత, ఆర్థిక స్థిరత్వం, మనశ్శాంతి పేరెంట్స్‌కు ముఖ్యంగా మారింది. ట్రంప్ పాలనలో వచ్చిన మార్పులు తాత్కాలికమవుతాయని, కానీ ఒకసారి చదువు మొదలైతే నలుగురిలో మిగిలిపోవడం కష్టం అవుతుందని అభిప్రాయపడుతున్నారు.

Read also: Gaurav Chintamanidi: అమెరికాలో ఉద్యోగం పూలపాన్పు కాదు..ఓ భారతీయుడి ఆవేదన

#AlternativeToUSA #HigherEducation #StudentVisa #StudyAbroad #StudyInCanada #UKUniversities Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.