రెండోసారి పదవిని స్వీకరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఏకాస్త అవకాశం వచ్చినా భారత్ ను నిందిస్తూనే ఉన్నారు. ప్రత్యేకంగా భారతీయులపై ఆయన నిత్యం తన అక్కస్తును వెళ్లగక్కుతూనే ఉన్నారు. కఠిన వీసా నిబంధనలతో విదేశీయుల రాకను యుద్ధప్రాతిపదికంగా అడ్డుకుంటున్నారు. దీంతో ఈ ఏడాది(America) విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఘననీయంగా తగ్గింది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వలసదారులను లక్ష్యంగా చేసుకుంటూ వస్తున్న ట్రంప్ యంత్రాంగం, తాజాగా హెచ్-1బీ వీసాదారులపై దృష్టి సారించింది. ఈ వీసా విధానాన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయంటూ అమెరికా లేబర్ డిపార్ట్ మెంట్ ‘ఎక్స్’ వేదికగా ఒక యాడ్ వీడియోను విడుదల చేసింది.
Read also: పాక్, ఆఫ్ఘాన్ లమధ్య కాల్పుల విరమణ.. ప్రకటించిన టర్కీ
భారత్ పై తీవ్ర ఆరోపణలు
అమెరికాన్ యువత స్థానంలో కంపెనీలు విదేశీ కార్మికులను(America)నియమించుకుంటున్నాయని తీవ్ర ఆరోపణలు చేసింది. హెచ్-1బీ వీసాల ద్వారా తక్కువ జీతాలకు విదేశీయులను పనిలో పెట్టుకుంటూ, స్థానిక అమెరికన్లకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించింది. ఈ వీసా పొందుతున్న వారిలో అత్యధికులు భారతీయులే ఉన్నారని ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హరం. ఇప్పటికు ట్రంప్ అక్రమ వలసదారులను భారీసంఖ్యలో వారి దేశాలకు పంపించింది. అంతేకాక వారిపై అరెస్టులు, చట్టబద్ధమైన సమావేశాలపై కూడా కఠిన ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ, మరోసారి వలసవాదాన్ని ప్రధాన అస్త్రంగా వాడుతున్నారు. ఇందులో భాగంగానే హెచ్-1బీ వీసాను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: