📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

America: మొక్కజొన్న దిగుమతులపై బంగ్లాదేశ్‌లో వివాదం

Author Icon By Radha
Updated: January 1, 2026 • 8:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(America) నుంచి బంగ్లాదేశ్‌కు మొక్కజొన్న దిగుమతి జరగనుందన్న సమాచారం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా అమెరికాలో మొక్కజొన్న సాగుకు పంది ఎరువును వినియోగిస్తారన్న ఆరోపణలు ఇస్లామిక్ దేశమైన బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున వివాదాన్ని రేపుతున్నాయి.

Read also: Social Media: ఫ్రాన్స్ సంచలన నిర్ణయం

America

అమెరికా రాయబార కార్యాలయ పోస్ట్‌తో రాజుకున్న వివాదం

డిసెంబర్ 27న ఢాకాలోని అమెరికా రాయబార కార్యాలయం చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ అంశాన్ని మరింత వివాదాస్పదంగా మార్చింది. ఆ పోస్ట్ అనంతరం నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ, అమెరికా తన మిగులు వ్యవసాయ ఉత్పత్తులను బంగ్లాదేశ్‌పై బలవంతంగా రుద్దుతోందని ఆరోపిస్తున్నారు.

ఈ చర్య అక్కడి ప్రజల మత విశ్వాసాలకు విరుద్ధమని, ఇస్లామిక్ ఆచారాలను దెబ్బతీసే విధంగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా చేపల మేతలో పంది మాంసానికి సంబంధించిన అవశేషాలు ఉన్నట్లు తేలడంతో, బంగ్లాదేశ్ ప్రభుత్వం ‘మీట్ అండ్ బోన్ మీల్’ పౌడర్‌పై నిషేధం విధించిన విషయం గుర్తుచేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజా మొక్కజొన్న దిగుమతులపై(America) మరింత జాగ్రత్త అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఆరోపణలు, విమర్శలపై ఇప్పటివరకు అమెరికా రాయబార కార్యాలయం నుంచి అధికారిక స్పందన వెలువడలేదు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

CornImport Google News in Telugu InternationalControversy Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.