📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Telugu News:Pakistan-యుఎన్ ఓలో బలుచిస్తాన్కు అండగా అమెరికా, బ్రిటన్

Author Icon By Pooja
Updated: September 19, 2025 • 4:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్, చైనాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్ఎ), దాని అనుబంధ సంస్థ మజీద్ బ్రిగేడ్లను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించేందుకు ఆ రెండు దేశాలు చేసిన ప్రయత్నాన్ని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ అడ్డుకున్నాయి. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి(The United Nations) 1267 ఉగ్రవాద ఆంక్షల కమిటీలో ఆయా దేశాలు టెక్నికల్ విధించాయి. పాకిస్తాన్లో చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (సిపిఆసి) ప్రాజెక్టులపై తరచుగా దాడులు చేస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్ఎ)ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని చైనా, పాకిస్తాన్లు చాలా కాలంగా కోరుతున్నాయి. బలూచిస్తాన్ లోని తమ వనరులను పాకిస్తాన్ దోచుకుంటోందని, చైనా ప్రాజెక్టుల వల్ల తమ ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని బిఎలీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఆ సంస్థ చైనా జాతీయులు, పాకిస్తాన్ సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది.

వేర్పాటువాద సంస్థలు అనేందుకు ఆధారాలు లేవు

ఈ దాడుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని 1267 కమిటీలో బిఎల్ఎ, మజీద్ బ్రిగేడ్లను ఉగ్రవాద సంస్థలుగా చేర్చాలని పాకిస్తాన్, చైనా ఒక ఉమ్మడి తీర్మానాన్ని ప్రతిపాదించాయి. అయితే, అల్-ఖైదా, ఐసిస్ వంటి సంస్థలకు సంబంధించిన గ్రూపులను మాత్రమే 1267 కమిటీ ఉగ్రవాద జాబితాలో చేరుస్తుందని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్పే ర్కొన్నాయి. బిఎల్ఎ వంటి వేర్పాటువాద సంస్థలను ఈ జాబితాలో చేర్చడానికి తగిన ఆధారాలు లేవని ఆ దేశాలు వాదించాయి. పాకిస్తాన్ లోని ఉగ్రవాదులను(Terrorists) ఐక్యరాజ్యసమితిలో ఉగ్రవాదులుగా ప్రకటించాలంటూ గతంలో భారత్ చేసి ప్రతిపాదనలను చైనా అడ్డుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్, చైనాలు చేసిన ప్రతిపాదనను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ అడ్డుకోవడం గమనార్హం.

బలూచిస్తాన్‌కు మద్దతుగా ఏ దేశాలు నిలిచాయి?
అమెరికా మరియు బ్రిటన్ బలూచిస్తాన్ ప్రజలకు అండగా ఉన్నట్లు వెల్లడించాయి.

బలూచిస్తాన్ సమస్య ఏమిటి?
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో స్వతంత్రత, మానవ హక్కుల అంశాలు తరచూ వివాదాస్పదంగా మారుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/rahul-gandhis-media-conference/national/550432/

Balochistan Issue Latest News in Telugu Pakistan Balochistan Conflict Telugu News Today UK on Balochistan UNO News US Supports Balochistan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.