ప్రతి స్త్రీ తల్లిగా కావాలని పరితపిస్తుంది. పెళ్లై సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా గర్భం దాల్చకపోతే ఆ దంపతుల ఆవేదనను వర్ణించలేం. కనిపించిన ప్రతి దేవుడిని వేడుకుంటారు. వైద్యపరంగా ఎన్నో చికిత్సలు తీసుకుంటారు. ఇందుకోసం లక్షలు ఖర్చుపెట్టేందుకు కూడా వెనుకాడరు. అలాంటి వారు గర్భం (pregnancy) దాలిస్తే.. ఇక వారి ఆనందమే వేరుగా ఉంటుంది. ప్రతినెల వైద్యపరీక్షలు చేసుకుంటారు. పుట్టే బిడ్డకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక తినే ఆహారంపై ఎంతో శ్రద్ధను చూపిస్తారు. కాఫీలు, టీలకు సాధ్యమైనంతవరకు దూరంగా ఉంటారు. ఇక మత్తుపదార్థాలు అంటే వాటి జోలికే వెళ్లరు. అలాంటి ఓ గర్భిణి తన కడుపులో బిడ్డ ఎదుగుతున్నా కూడా మత్తుపదార్థాలను సేవించింది. దీంతో బిడ్డ గర్భంలోనే మరణించింది. అయితే కోర్టు ఏకంగా 18సంవత్సరాల శిక్షను విధించింది.
Read also: America: మాజీ అధ్యక్షుడు కెన్నెడీ మనవరాలు హఠాన్మరణం
Baby dies in the womb
మాదకద్రవ్యాలు ఉపయోగించడం వల్లే బిడ్డ మరణించినట్లుగా
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. సంచలన తీర్పు ఇచ్చిన అమెరికా అమెరికాలో ఓ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. గర్భంలో శిశువు మరణించినందుకు ఓ మహిళకు ఏకంగా 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు ఇప్పుడు అగ్ర రాజ్యంలో సంచలనంగా మారింది. గర్భస్థ శిశువు మరణం కారణంగా తల్లిని ఈ రీతిలో శిక్షించడం ప్రపంచ చరిత్రలో ఇదే తొలిసారి అయి ఉండొచ్చు. అమెరికాలోని అలబామాకు చెందిన బ్రూకర్ షూమేకర్ అనే మహిళ గర్భం దాల్చింది. అయితే 2017లో కడుపులో ఉన్న బిడ్డ మరణించింది. అయితే గర్భధారణ సమయంలో మాదకద్రవ్యాలు ఉపయోగించడం వల్లే బిడ్డ మరణించినట్లుగా ఆమెపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారం న్యాయస్థానానికి చేరింది. ఈ కేసు దర్యాప్తులో తల్లి తీసుకున్న రసాయనాలు కారణంగానే బిడ్డ చనిపోయినట్లుగా నిర్థారణ అయింది. దీంతో మహిళను కోర్టు దోషిగా తేల్చింది. అనంతరం ఆమెకు 18ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది.
తల్లి మత్తుపదార్థాలు వాడడం తప్పే..
తల్లికి శిక్షపై కొత్త చర్చకు దారి అయితే ఈ తీర్పు ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. గర్భస్థ శిశువు మృతికి తల్లిని శిక్షించడమేంటి? అని విమర్శలు వస్తున్నాయి. ఇంకోవైపు న్యాయస్థానం తీర్పును మహిళా హక్కుల సంస్థ ప్రెగ్నెన్సీ జస్టిస్ ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. మరోవైపు తప్పుడు తీర్పు అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. గర్భధారణ సమయంలో జరిగే విషాదాలను నేరంగా పరిగణించాలా? వద్దా అనే చర్చ మొదలైంది. శిశువు మరణానికి మహిళలను చట్టబద్దంగా శిక్షించడం సరైనదేనా? కాదా? అన్న వివాదం జరుగుతోంది. శిశువు మరణం సహజమైనా లేదా మానవ నిర్లక్ష్యం అయినా కారణాలు ఏవైనా కావొచ్చని.. కానీ తల్లిని నేరస్థురాలిగా పరిగణించి జైల్లో పెట్టడం ఎంతవరకు సమంజసం అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. తల్లి మత్తుపదార్థాలు వాడడం తప్పే.. అయినంత మాత్రం శిక్ష ఇంత కఠినంగా ఉండాలా అంటూ వాపోతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: