అమెరికాలో జననాల రేటు తగ్గుతుండటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ట్రంప్ ప్రభుత్వం పలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది పిల్లలను కనాలనే ఉద్దేశంతో “బేబీ బోనస్”గా పిలవబడే స్కీమ్‌పై అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా బిడ్డకు జన్మనిచ్చే ప్రతి మహిళకు $5,000 డాలర్ల నగదు బోనస్ ఇవ్వాలని ప్రతిపాదించారు. అదేవిధంగా పన్ను మినహాయింపులు, కుటుంబ స్కాలర్షిప్‌లు వంటి అంశాలు కూడా పరిశీలనలో ఉన్నాయి.వైట్ హౌస్‌లో ఇటీవల ఈ అంశంపై ఓ అంతర్గత సమావేశం నిర్వహించారు. ఇందులో ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ వంటి నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సంతానోత్పత్తి ప్రోత్సాహానికి సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చాయి. కానీ, ఇప్పటివరకు ఎలాంటి తుదినిర్ణయాలు తీసుకోలేదు. అయితే, ఈ బోనస్ ప్రణాళికపై పలువురు నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు.జనాభా పెంపు అంశాన్ని ఇప్పటికే వాన్స్ మరియు మస్క్ లాంటి ప్రముఖులు పలు సందర్భాల్లో ప్రస్తావించారు. వాన్స్ సంతానోత్సాహం లేకపోతే నాగరికత సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎలాన్ మస్క్ కూడా ఎక్కువ మంది పిల్లలు కలిగిన కుటుంబాలను ప్రోత్సహించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
America :జనాభా పెంపు కోసం బేబీ బోనస్ ప్రణాళిక: అమెరికా కొత్త దిశలో
అమెరికాలో జననాల రేటు గత మూడు దశాబ్దాలుగా క్షీణించుతోంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) నివేదిక ప్రకారం, 2023లో జననాల రేటు 1.62గా నమోదైంది. ఇది రీప్లేస్మెంట్ స్థాయి 2.1 కన్నా తక్కువ. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరిగిన జీవన వ్యయం, శ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యం, సామాజిక విలువల్లో మార్పు వంటి అంశాలు ఈ తగ్గుదలకు కారణంగా చూపుతున్నారు.ఈ నేపథ్యంలో, అమెరికా ప్రభుత్వం జనాభా పెంపుకు అవసరమైన మార్గాలను పరిశీలిస్తోంది. అయితే ప్రతిపాదిత ప్రణాళికలు అమలవుతాయా లేదా అనేది అధికారిక నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.
Read More : AP 10th Results 2025 : నేడే ఏపీ టెన్త్ ఫలితాలు