📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

OPERATION SINDOOR: ఉద్రిక్తతలపై అమెరికా, చైనా ఆందోళన

Author Icon By Shobha Rani
Updated: May 10, 2025 • 1:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్, పాకిస్థాన్ (India-pak)మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై చైనా, అమెరికా, జీ7 దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇరుదేశాలు సంయమనం పాటించి, సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించాయి. ఈ మేరకు ప్రకటనలు విడుదల చేశాయి.
ఆపరేషన్ సిందూర్ తరువాత అంతర్జాతీయ ఆందోళన
భారత్, పాకిస్థాన్ (India-pak) మధ్య నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరుదేశాలు సంయమనంతో వ్యవహరించాలని కోరింది. ఉద్రిక్తత తీవ్రతరం కావడం పట్ల తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని తెలిపింది. “భారత్, పాకిస్థాన్ శాంతి, స్థిరత్వం కోసం సంయమనం పాటించాలి. శాంతియుత మార్గాల ద్వారా పరిష్కారం కనుక్కొవాలి. ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలకు దూరంగా ఉండాలి. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనాలని అంతర్జాతీయ సమాజం ఆశిస్తోంది. ఈ లక్ష్యం కోసం చైనా నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది” అని చైనా ప్రకటన విడుదల చేసింది.

OPERATION SINDOOR: ఉద్రిక్తతలపై అమెరికా, చైనా ఆందోళన

చర్చలతో పరిష్కారానికి దారితీయాలి
భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (marco rubio) ఫోన్ లో మాట్లాడారు. అవసరమైతే ఇరుదేశాల మధ్య చర్చలకు సాయం చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ ప్రకటన విడుదల చేశారు. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ ప్రకటన ప్రకారం విదేశాంగ మంత్రి మార్కో రూబియో, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, భారత్ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో ఫోన్‌లో మాట్లాడారు. ఇరుదేశాలు తీవ్రమైన చర్యలకు పాల్పడకముందే చర్చలు జరపాలని సూచించారు. అవసరమైతే అమెరికా మధ్యవర్తిత్వం కూడా అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.

Read Also: Pakistan : పాకిస్తాన్ విరుచుకుపడడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితి

America and China are worried about tensions Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.