📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: America: అమెరికాకు విదేశీ ఉద్యోగుల అవసరం ఉంది: ట్రంప్

Author Icon By Sushmitha
Updated: November 20, 2025 • 2:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏవిధంగానైనా విదేశీయుల రాకను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నేడు మాట మార్చాడు. వీసాల విధానాల్లో కఠిన నియమాలను విధించడంతో విదేశీ విద్యార్థుల సంఖ్య, ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనికితోడు హెచ్-1బీ వీసాపై (H-1B visa) కూడా పలు నిబంధనల్ని విధించారు. అయితే తాజాగా విదేశీ ఉద్యోగుల అవసరం అమెరికాకు చాలా ఉందని ట్రంప్ అంగీకరించారు. ఈ విషయాన్ని ‘మాగా’ మద్దతుదారులు అర్థం చేసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

 Read Also: APMDC: విదేశాల్లో మైనింగ్ కార్యకలాపాలు

America needs foreign workers: Trump

అమెరికా-సౌదీ పెట్టుబడుల ఫోరమ్ లో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా అమెరికాలో (America) చాలాపెద్ద సంఖ్యలో ప్లాంట్లను నిర్మించన్నుట్లు తెలిపారు. ఇవి దేశ ఆర్థికవృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ఈ ప్లాంట్లలో పనిచేసేందుకు విదేశీ నైపుణ్యం కలిగిన వారిని తీసుకురావాల్సి ఉందన్నారు. వారు అమెరికన్లకు కూడా ఆ నైపుణ్యాలను నేర్పించాలన్నారు.

నిపుణులు లేకపోతే విజయాన్ని సాధించలేరు

అమెరికాలోని కంపెనీల్లో బిలియన్ డాలర్ల కొద్దీ పెట్టుబడులు పెట్టి స్థానిక నిరుద్యోగులను నియమించుకొని నిపుణులు లేకపోతే విజయం సాధించలేరని ట్రంప్ వ్యాఖ్యానించారు. విదేశీ ఉద్యోగులు అమెరికన్లకు నైపుణ్యాలు నేర్పించి ఆ తర్వాత తిరిగి స్వదేశాలకు వెళ్లొచ్చన్నారు. అరిజోనాలో బిలియన్ డాలర్లతో భారీ కంప్యూటర్ చిప్ ఫ్యాక్టరీ తెరిచి దాన్ని నడిపేందుకు నిరుద్యోగులను తీసుకుంటారని తాను భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. విదేశీ వృత్తి నిపుణులు తమ వెంట వేలాది మందిని తీసుకురావాలని.. వారిని తాను స్వాగతిస్తానని ట్రంప్ చెప్పారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Donald Trump foreign workers Google News in Telugu H-1B visa debate. immigration policy shift Latest News in Telugu skilled labor Telugu News Today US Economy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.