తనను ఎన్నుకుంటే అమెరికా(America) దేశాన్ని మార్చివేస్తానని, దేశ చరిత్రను తిరగరాస్తానని పలు వాగ్దానాలు చేసిన డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్టే గెలిచారు. ఇంకేమీ ఉంది అమెరికా ప్రజలు తమ కష్టాలన్నీ తీరతాయని ఆశించారు.
కానీ ట్రంప్(Donald Trump)అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ దేశప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఖర్చులను తగ్గించుకునేందుకు పలు కంపెనీలకు ఉద్యోగులను తగ్గించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించివేసారు. వారికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, ఉన్నపళంగా విధుల్ని వదిలి వెళ్లాలని హుకుం జారీ చేశారు. అనేక నిబంధనల్ని తీసుకొచ్చారు.
దీంతో ప్రజలు తీవ్ర నిరసనల్ని చేపట్టారు. కొందరు కోర్టులను ఆశ్రయించి, ట్రంప్ విధానాలను ఎండగట్టారు. పైకి అగ్రరాజ్యం అని డాబులు చెప్పుకుంటున్నా నిధులు లేక అమెరికా నానా అవస్థలూ పడుతోంది. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అనే నినాదంతో వైల్డ్ డెసిషన్స్ తీసుకున్నారు. ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కలిసి అమెరికా చాలావాటిని మార్చేశారు. తరువాత ఇందులో నుంచి నెమ్మదిగా మస్క్ తప్పుకున్నారు. కానీ ట్రంప్ మాత్రం ఎడాపెడా పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు.
ఇందులో అతిపెద్దది టారిఫ్ లు(tariff). ఇతర దేశాల నుంచి దిగుమతి చేసే వస్తువులపై అదనపు సుంకాలను విధించారు. దీంతో ఆమెరికాకు బోలెడు డబ్బులు వస్తాయి అన్నారు. యూఎస్ మళ్లీ ధనిక దేశం అయిపోతుందని చెప్పారు. కానీ తీరా చూస్తే సీన్ రివర్స్ అయిపోయింది.
కోరి మరీ కష్టాలు తెచ్చుకున్న యుఎస్
టారీఫ్ లతో విపరీతమైన మనీ వచ్చేస్తుంది. అమెరికా(America) సంపన్న దేశం అయిపోతుంది అనుకున్నారు ట్రంప్. కానీ సుంకాల పెంపుతో అమెరికా పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. ఆర్థిక మాంద్యం అంచుల్లో కొట్టుమిట్టాడుతోంది.
ఇప్పటికే ఈ విషయం చాలామంది హెచ్చరించారు. తాజాగా 2008లో యూఎస్ ఆర్థిక మాంద్యాన్ని అంచనా వేసిన మొదటి ఎకనామిస్ట్ మార్క్ జండీ అమెరికా స్థితిగతులపై మాట్లాడారు. ట్రంప్ టారిఫ్ అమలు ఓ చెత్త నిర్ణయం అని గద్దించారు. వాటి కారణంగా అమెరికా మరింత ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతోందని వాపోయారు.
తగ్గిన దిగుమతి వస్తువుల సంఖ్య
కెనడా, మెక్సికో, చైనా, భారత్ లాంటి దేశాల మీద అదనపు సుంకాలతో విరుచుకుపడ్డారు ట్రంప్. దీంతో అక్కడి నుంచి యూఎస్ కు దిగుమతి అయ్యే వస్తువుల సంఖ్య తగ్గిపోయింది. ఒకవేళ వచ్చినా అధిక సుంకాలు చెల్లించాల్సి రావడంతో రేట్లను విపరీతంగా పెంచేశారు.
దీంతో ఈ భారం అంతా అమెరికాలో వినియోగదారులపై పడింది. చవక వస్తువులకు మూరు పేరైన వాల్ మార్ట్, టార్గెట్ లాంటి వాటిల్లో కూడా ధరలు పెరుగుదల కనిపించింది. పలు కంపెనీలు ఉత్పత్తులను పంపొద్దని చెబుతున్నాయి. దీని కారణంగా నిత్యావసర వస్తువుల ధరలకు కూడా రెక్కలొచ్చాయి.
భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే అమెరికాలో మరింత ఆర్థిక మాంద్యం చవిచూడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Hindi news: Hindi.vaartha.com
Read Also: