📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

America: ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ కాల్పులకు ఓ మహిళ బలి

Author Icon By Saritha
Updated: January 8, 2026 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(America) అమెరికాలో దారుణం జరిగింది. ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు మారణహోమం సృష్టించారు. వలసదారులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ (Trump) రెండవసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. వలసదారులను పట్టుకుని స్వదేశాలకు పంపేస్తున్నారు. తాజాగా బుధవారం మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్ లో ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్ నిర్వహించింది. ఇంకోవైపు ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్ కు వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలు నిర్వహించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఫెడరల్ ఏజెంట్లు రంగంలోకి దిగి చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇమ్మిగ్రేషన్ ఏజెంట్.. కారులో కూర్చున్న మహిళపై కాల్పులకు పాల్పడ్డాయి. దీంతో రెనీ గుడ్ (37) అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మహిళ మృతి తర్వాత పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Read Also: AP: వైద్య సేవల్లో ప్రభుత్వ కృషికి గుర్తింపు

ట్రంప్ పై మండిపడ్డ మిన్నెసోటా గవర్నర్

ట్రంప్ (America) పరిపాలపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్ట్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది భయానక సంఘటనగా పేర్కొన్నారు. తమకు సమాఖ్య ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అవసరం లేదని.. రాష్ట్రాన్ని రక్షించడానికి నేషనల్ గార్డ్స్ ను అప్రమత్తంగా ఉంచినట్లు తెలిపారు. ఇక ఈ ఘటనను న్యూయార్క్ మేయర్ మజ్దానీ కూడా తప్పుపట్టారు. డెమోక్రటిక్ పాలనలో ఉన్న నగరాలపై ఉద్దేశ పూర్వకంగా ఇమ్మిగ్రేషన్ ఏజంట్లు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. మిన్నెసోటాలో పాలనలో ఉన్న నగరాలపై ఉద్దేశ పూర్వకంగా ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఇది కచ్చితంగా హత్యేనని వారు అన్నారు. దీనిపై రెనీగుడ్ తల్లి స్పందించారు. ఇమ్మిగ్రేషన్ నిరసనలతో రెనీగుడ్ కు ఎలాంటి సంబంధం లేదని ఆమె వాపోయారు. రెనీగుడ్ కు ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిపింది. తన కూతురిని అన్యాయంగా కాల్చి చంపారని వాపోయింది. బాధితురాలు అమెరికా పౌరురాలని.. ఆమెకు ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్ లక్ష్యం కాదని డెమోక్రటిక్ సెనేర్ టీనా స్మీత్ పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ImmigrationShooting Latest News in Telugu Minneapolis ProtestViolence Telugu News TrumpAdministration USPolitics WomanKilled

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.