📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Telugu News: America: ఇంటెంట్ టు లీవ్ రూల్ రద్దుతో భారతీయులకు భారీ ఊరట

Author Icon By Sushmitha
Updated: November 26, 2025 • 1:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎంతోమంది (America) విద్యార్థులు, ఉద్యోగులు తమ డాలర్ కలలు కరిగిపోతున్నాయని చాలా బాధపడుతున్నారు. ఎన్నో ప్రణాళికల్ని వేసుకుని, అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న వారి ఆశలు, ఆశయాలన్నీ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వీసాల కఠిన నిబంధనలతో ఆడియాశలుగా మారుతున్నాయి. అయితే మనదేశస్తులకు గుడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా.. అయితే మీరే చదవండి ఆ వివరాలు ఏమిటో.. అమెరికా విద్యార్థులకు త్వరలోనే భారీ ఊరట లభించనుంది. 

Read also : H-1B Visa: హెచ్‌-1బీ వీసాలో భారీ కుంభకోణం ఎక్కడంటే?

America A huge relief for Indians with the repeal of the Intent to Leave rule

తమ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా స్వదేశానికి తిరిగెళ్తామని నిరూపించుకోవాల్సిన అవసరం ఇకపై ఉండదు. దీనికి సంబంధించిన ఇంటెంట్ టు లీవ్ అనే నిబంధనను రద్దు చేయనున్నట్లు సమాచారం. ఎఫ్-1 వీసాల జారీలో ప్రస్తుతం అనుసరిస్తున్న ఇంటెంట్ టులీవ్ నిబంధన రద్దు దిశగా డిగ్నిటీయాక్ట్-25ను చట్ట సభ్యులు ప్రతిపాదించారు. ఇది త్వరలోనే ఆమోదం పొందుతుందని చెబుతున్నారు. ఈ చట్టం కాంగ్రెస్ ఉభయ సభల్లోనూ ఆమోదం పొందాలి. ఆ తర్వాత ట్రంప్ దానిపై సంతకం చేయాలి.

ఇంటెంట్ టు లీవ్ రూల్

ప్రస్తుతం చాలా ఎఫ్-1 వీసాలు (F-1 visa) అంటెంట్ టు లీవ్ రూల్ కిందనే తిరస్కరించబడుతున్నాయి. దీని ప్రకారం విద్యార్థి వీసాల కోసం అప్లే చేసుకునే విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అమెరికా విడిచి వెళ్లిపోతామని అధికారి వద్ద నిరూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం దరఖాస్తుదారులు తమ స్వదేశంలో ఉన్న తమ ఆస్తులు లేదా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన పత్రాలను చూపించాల్సి ఉంటుంది. ఇది విద్యార్థులకు చాలాభారంగా మారింది.

ముఖ్యంగా భారత విద్యార్థులకు. దీని కారణంగా ఈ ఏడాది భారతీయ విద్యార్థుల వీసాల జారీ సంఖ్య కూడా భారీగా తగ్గిపోతుంది. ఈ వీసాల తిరస్కరణల్లో అత్యధికం ‘ఇంటెంట్ టు లీవ్’ను నిరూపించుకోలేని అభ్యర్థులవే ఉండటం వల్లనే అని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ రూల్ తీసేస్తే అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

America immigration Google News in Telugu Indian immigrants Intent to Leave Rule Latest News in Telugu relief for Indians Telugu News Today travel restrictions. visa policy change

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.