📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం

America: రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం.. గాయపడ్డ ఇద్దరు పిల్లలు

Author Icon By Rajitha
Updated: January 5, 2026 • 3:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎన్నో కలలు కంటూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు ఆ దంపతులు. రెక్కలు ముక్కలు చేసుకుని, కుమారుడిని కష్టపడి చదివించారు తల్లిదండ్రులు. అనుకున్నట్లుగా ఆ కుమారుడు చక్కగా చదువుకుని, అమెరికాలో (United States) సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ పనిచేస్తున్నారు. పెళ్లి చేసుకుని, ఇద్దరు బిడ్డలతో హాయిగా కాలం గడుపుతున్నారు. పదిరోజుల క్రితమే ఇండియాకు వచ్చి, కుటుంబ సభ్యులతోను, గ్రామస్తులతోను ఆనందంగా గడిపారు. ఇక సెలవంటూ తిరిగి అమెరికాకు వెళ్లిపోయారు. కానీ ఆ సెలవు శాశ్వతమైనదిగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ప్రమాదంలో దంపతులు మరణించగా..పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Read also: Riots Case: ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులకు బెయిల్ తిరస్కరణ

couple died tragically in a road accident

కుటుంబానికి అందిన సమాచారం

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు దంపతులు మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన భార్యాభర్తలు కొటికలపూడి కృష్ణ కిశోర్ (45), ఆశ (40) వాషింగ్టన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి కుమార్తె, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు వారి కుటుంబసభ్యులకు సమాచారం అందింది. కృష్ణ కిశోర్ గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. ఆ దంపతులు పదిరోజుల క్రితం పాలకొల్లు వచ్చి తిరిగి వెళ్లారు. మార్గమధ్యంలో దుబాయ్ లో న్యూఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. వీరి మృతితో పాలకొల్లులో విషాదఛాయలు అలముకున్నాయి. తమతో ఎంతో ఆనందంగా గడిపి, వెళ్లిన తమ కొడుకు, కోడలు ఇక లేరు అనే విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Palakollu Road Accident Telugu Family Telugu News USA accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.