మన భారతీయులు(Indians)ఇతర దేశాలకు వెళ్లి సక్రమంగా ఉండకుండా అక్కడ అక్రమాలు చేస్తూ, దేశ పరువును మంటకలుపుతున్నారు. ఇండియన్ గవర్నమెంట్ (America) ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా ఏమాత్రం ఖాతరు చేయకుండా, ఇతర దేశాల్లో నేరాలు చేస్తూ, దేశ పరువును తీస్తున్నారు. తాజాగా అమెరికాకు అక్రమ రవాణా మార్గం ద్వారా వెళ్లిన 54మంది భారతీయులను తిరిగి పంపించారు. ఆదివారం సాయంత్రం వారంతా ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ 54 మంది కూడా హర్యానా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారు. వీరందరినీ అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో భారత్ కు పంపగా, ఈ సంఘటన వెనుక ఉన్న మానవ అక్రమ రవాణా మార్గం `డాంకీ రూట్’పై పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మకం చేశాయి.
డాలర్పై ఆశ ఉన్న యువకులే టార్గెట్ అమెరికాలో మెరుగైన జీవితం కోసం ఆశపడిన ఈ యువకులను మోసగించి, దళారులు అత్యంత ప్రమాదకరమైన, చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా అమెరికాకు పంపించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ‘డాంకీ రూట్’ అని పిలిచే ఈ అక్రమ ప్రయాణంలో, వలసదారులు అనేక దేశాల సరిహద్దులను దాటుతూ, దట్టమైన అడవులు, పర్వతాలు, జలమార్గాల గుండా ప్రమాదకరమైన మార్గాల్లో నడవాల్సి వస్తుంది.
Read also: శ్రేయస్‌కు గాయం.. అసలు ఏమైందంటే?
సోదాలు నిర్వహిస్తున్న ఈడీ
పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఎస్ఐఆర్ ల ఆధారంగా ఈ కేసును(America) దర్యాప్తు చేస్తున్న ఈడీ, ఈ అక్రమ రవాణాల్లో ప్రమేయం ఉన్న ట్రావెల్ ఏజెంట్లు, మధ్యవర్తుల ఇళ్లు, కార్యాలయాలపై పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
అక్రమ రవాణా ద్వారా వచ్చిన డబ్బును గుర్తించేందుకు మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు జరుగుతోంది. గయానా, బ్రెజిల్, పెరూ, పనామా, మెక్సికో వంటి దాదాపు 10కి పైగా దేశాల ద్వారా ప్రయాణించి, చివరికి అమెరికా సరిహద్దుల్లో పట్టుపడినట్లు బహిష్కరించబడిన కొంతమంది యువకుల వాంగ్మూలాల ప్రకారం తెలుస్తున్నది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: