16000 layoffs : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం Amazon మరోసారి భారీ లేఆఫ్స్‌కు తెరలేపింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. గత మూడు నెలల్లోనే ఇది రెండోసారి ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత విధించడం కావడం గమనార్హం.
సంస్థలో కొనసాగుతున్న నిర్మాణాత్మక మార్పుల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ స్పష్టం చేసింది. ఈ విషయంపై స్పందించిన పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ Beth Galetti, అనవసరమైన మేనేజ్‌మెంట్ లేయర్లను తగ్గించి సంస్థను మరింత సమర్థవంతంగా మార్చడమే లక్ష్యమని తెలిపారు.
Read Also: Vishwak Sen: ఫిబ్రవరి 13న ‘ఫంకీ’ మూవీ విడుదల
ఉద్యోగాలు కోల్పోయిన వారికి అమెజాన్ సపోర్ట్ (16000 layoffs) ప్యాకేజీ అందిస్తామని వెల్లడించింది. అమెరికాలోని ఉద్యోగులకు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి 90 రోజుల గడువు ఇవ్వడంతో పాటు, అవసరమైతే సెవరాన్స్ ప్యాకేజీ, ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలు కల్పిస్తామని పేర్కొంది. అయితే, భవిష్యత్తుకు కీలకమైన విభాగాల్లో పెట్టుబడులు, నియామకాలు కొనసాగుతాయని కంపెనీ స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: