📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Amazon: అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్

Author Icon By Anusha
Updated: November 1, 2025 • 12:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచవ్యాప్తంగా వెంటాడుతున్న ఆర్థికమాంద్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీతో టాప్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నది. కంపెనీలకు పెరుగుతున్న ఆర్థిక భారం నుంచి గట్టెక్కేందుకు ఉద్యోగులను తగ్గించుకునే పనిపడ్డాయి. ఉద్యోగులకు జీతాలను ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. టెక్ ప్రపంచంలో మరోసారి కంపెనీల వర్క్ కల్చర్ పై చర్చ మొదలైంది.

Read Also: CM Pinarayi Vijayan: పేదరికాన్ని నిర్మూలించిన టాప్ రాష్ట్రంగా కేరళ

మెసేజ్ లో ఉన్న విషయం ఏమిటంటే..

కారణం అమెజాన్ (Amazon) ఒక ఉద్యోగికి తెల్లవారుజామున 3గంటలకు పంపిన లేఆఫ్ మెసేజ్! ఆ సమయానికి ఎవరు ఊహించగలరు ఆ సమయానికి ఉద్యోగం పోయిందని మెసేజ్ వస్తుందని? రెడిట్ లో ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొలైంది.

ఒక యూజర్ సరదాగా ఇలా రాశాడు ‘3 ఏఎంలో అవుట్ లుక్ పని చేయడం మానేసింది, కానీ లేఆఫ్ మెసేజ్ మాత్రం సమయానికి వచ్చింది. ఎంత కఠినమైన పని!.

రాత్రివేళలోనే ఉద్యోగం పోయిందని చెప్పేస్తారా?

“అమెజాన్ నుండి: ఆఫీసుకి రాకముందు మీ పర్సనల్ లేదా వర్క్ ఇమెయిల్, స్పామ్ ఫోల్టర్ తో సహా చెక్ చేయండి. మీ రోల్కు సంబంధించిన సమాచారం అందులో ఉంటుంది’ ఇది విన్న తర్వాత చాలామంది టెక్ ఉద్యోగులు షాక్ అయ్యారు.

‘ఇప్పుడా? రాత్రివేళలోనే ఉద్యోగం పోయిందని చెప్పేస్తారా?” అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడూ డెడ్ లైన్లు, రాత్రి మీటింగ్స్, నిద్ర లేకుండా పని చేసే టెక్ ఉద్యోగులకు ఇప్పుడు లేఆఫ్ మెసెజ్ కూడా రాత్రి రావడం కొత్త ఆందోళనగా మారింది.

Amazon

చివరికి నాకు శాంతి దొరికింది

ఓ మాజీ ఎఫ్ ఎఎఎన్ జి(ఫేస్బుక్, ఆపిల్, అమెజాన్, గూగుల్) ఉద్యోగి తన అనుభవం షేర్ చేస్తూ భావోద్వేగంగా రాశాడు. ‘టెక్ ప్రపంచం నుంచి బయటకు రావడం, అది నా ఇష్టంతోనా లేక లేఆఫ్ కారణంగానా, కానీ చివరికి నాకు శాంతి దొరికింది. ఆయన ఇలా చెప్పారు.

తన స్నేహితుడు స్వచ్చందంగా,రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయాడు. వీసా భయం, భవిష్యత్తుపై అనిశ్చితి ఉన్నప్పటికీ, ఇప్పుడైనా ఊపిరి పీల్చగలుగుతున్నాను, మళ్లీ సరిగ్గా నిద్రపోగలుగుతున్నాను’ అని రాశాడు.

సాంకేతికత విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్

అమెజాన్ (Amazon) ఈ వారం వరకు సుమారు 14,000 ఉద్యోగులను తొలగించింది. కంపెనీ వ్యక్తుల అనుభవం, సాంకేతికత విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాలెట్టి ఒక బ్లాగ్ లో ఈ విషయాన్ని తెలిపారు. ఆమె చాలా చెప్పారు.

ఈ తగ్గింపులు మా కంపెనీని మరింత బలంగా, సమర్థవంతంగా మార్చేందుకు చేస్తున్నాం. అనవసరమైన లేయర్లు తగ్గించి, కస్టమర్ల ప్రస్తుత, భవిష్యత అవసరాలపై దృష్టి పెడుతున్నాం అని ఆమె పేర్కొన్నారు.

ఓ మాజీ ఉద్యోగి తన అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు..

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

3AM layoff email Amazon layoff Employee Termination latest news Reddit viral post Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.