📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Google: OpenAI సీఈఓ ప్రకటనతో కుప్పకూలిన ఆల్ఫాబెట్ షేర్లు

Author Icon By Vanipushpa
Updated: October 23, 2025 • 12:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టెక్ ప్రపంచంలో మంగళవారం నిజమైన భూకంపం చోటుచేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ముందంజలో ఉన్న OpenAI(OpenAI) సంస్థ తన కొత్త AI ఆధారిత వెబ్ బ్రౌజర్ ChatGPT Atlas ను ప్రపంచానికి పరిచయం చేసింది. కేవలం 6 సెకన్ల నిడివి గల ఒక రహస్య వీడియో ద్వారా ఈ ప్రకటన వెలువడింది. ఆ వీడియోలో కొద్ది ట్యాబ్‌లు మాత్రమే కనిపించాయి. వెంటనే CEO సామ్ ఆల్ట్‌మన్ ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడుతూ .. ఇది దశాబ్దానికి ఒకసారి వచ్చే అవకాశం. ఇప్పుడు బ్రౌజర్ అంటే ఏమిటో మనం తిరిగి ఆలోచించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఈ ఒక్క వాక్యం పెట్టుబడిదారుల్లో పెద్ద కలకలం రేపింది. AI ఆధారిత బ్రౌజింగ్ యుగం ప్రారంభమవుతోందన్న అంచనాలు మార్కెట్‌లో చెలరేగాయి. దీని తక్షణ ప్రతిచర్యగా గూగుల్ (Google)మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లు 4.8 శాతం వరకు పడిపోయాయి, ఒక దశలో 246.15డాలర్లకి చేరుకున్నాయి. తరువాత కొంత కోలుకున్నప్పటికీ, రోజు చివరికి 2.4 శాతం తగ్గి 250.46 డాలర్ల వద్ద ముగిశాయి. ఈ ఒక్కరోజులోనే కంపెనీ మార్కెట్ విలువ 150 బిలియన్ల డాలర్ల మేర ఆవిరైంది.

Read Also: Louvre Heist: చరిత్రలోనే పెద్ద దోపిడీ – 7 నిమిషాల్లో మ్యూజియం ఖాళీ

Google

గూగుల్‌కు పోటీగా చాట్‌జిపిటి

OpenAI CEO సామ్ ఆల్ట్‌మన్ మాటల్లో చెప్పాలంటే.. Atlas వెబ్ బ్రౌజింగ్‌కి కొత్త నిర్వచనాన్ని ఇస్తుంది. ఈ బ్రౌజర్ Google Chrome (Chromium) ఇంజిన్‌పైనే నిర్మించబడింది. కానీ దీని ప్రత్యేకత AIను ప్రతి వెబ్‌పేజీలో నేరుగా పొందుపరచడం. అంటే యూజర్‌కి ChatGPT వాడటానికి ప్రత్యేక ట్యాబ్ అవసరం లేదు. మీరు ఏ వెబ్‌సైట్‌ చూస్తున్నా అదే పేజీలో ChatGPT మీకు సహాయం చేస్తుంది. సమాచారాన్ని సారాంశం చేయడం, పోలికలు ఇవ్వడం, లేదా ఇన్‌స్టెంట్ సమాధానాలు అందించడం వంటి పనులను చేస్తుంది. గూగుల్‌కు పోటీగా చాట్‌జిపిటి నుంచి అట్లాస్ బ్రౌజర్..ఎలా పనిచేస్తుందంటే.. ఇక మరో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ Agent Mode. ఈ మోడ్‌లో AI యూజర్ కర్సర్, కీబోర్డ్‌ను నియంత్రించగలదు. ఉదాహరణకు విమాన టికెట్ బుక్ చేయడం, పరిశోధన పత్రాలు సవరించడం, లేదా ఆన్‌లైన్ ఫారమ్‌లు నింపడం వంటి క్లిష్టమైన పనులను స్వయంచాలకంగా పూర్తిచేస్తుంది.

గూగుల్‌ ప్రకటన ఆదాయంపై పెద్ద ప్రభావం

ఈ పోటీ కేవలం బ్రౌజర్ మార్కెట్ వరకే పరిమితం కాదు. గూగుల్‌ ఆదాయంలో ఎక్కువ భాగం సెర్చ్, ప్రకటనల ద్వారా వస్తుంది. అయితే ChatGPT Atlas లాంటి AI బ్రౌజర్‌లు నేరుగా సమాధానాలు ఇస్తాయి. యూజర్ Google సెర్చ్‌కి వెళ్లే అవసరం తగ్గుతుంది. ఫలితంగా ఇది గూగుల్‌ ప్రకటన ఆదాయంపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. OpenAI ఇప్పటికే 800 మిలియన్ల వారపు వినియోగదారుల విస్తృత స్థావరాన్ని కలిగి ఉంది. వీరిలో చిన్న శాతం మంది కూడా Atlas వైపు మళ్లినా, అది గూగుల్‌కి ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ అవుతుంది. గూగుల్ తన Chrome బ్రౌజర్‌లో Gemini AIని ఇప్పటికే సమీకరించింది.. కానీ OpenAI ప్రకటించిన Atlas ఫీచర్లు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

OpenAI ఒక భారతీయ కంపెనీనా?
అవును, OpenAI భారతదేశంలో తన ఉనికిని ఏర్పరచుకుంటోంది, న్యూఢిల్లీలో తన మొదటి కార్యాలయాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది మరియు ఇప్పటికే స్థానిక యూనిట్‌ను ఏర్పాటు చేసింది. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న వినియోగదారు బేస్ మరియు డెవలపర్ కమ్యూనిటీకి ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకోబడింది మరియు భారతదేశంతో సహకారంతో AIని మరింత అందుబాటులోకి తీసుకురావడం మరియు దాని AI నమూనాలను నిర్మించడం కంపెనీ లక్ష్యం.

OpenAI కి CEO ఎవరు?
సామ్ ఆల్ట్మాన్ (29 నవంబర్ 2023–)
OpenAI / CEO
కృత్రిమ మేధస్సు (AI) ద్వారా తొలగించబడుతున్న లేదా రూపాంతరం చెందుతున్న ఉద్యోగాల రకాలను దీర్ఘకాలంలో "నిజమైన పని"గా పరిగణించకపోవచ్చని OpenAI CEO సామ్ ఆల్ట్మాన్ సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

AI technology Alphabet Artificial intelligence Financial Markets Google Latest News Breaking News OpenAI Sam Altman stock market Tech News Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.