📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ali Larijani: పాపం అలీ లారిజానీ ఎలా చిక్కాడంటే..!

Author Icon By Vanipushpa
Updated: March 19, 2026 • 4:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్‌ (Iran) కీలక వ్యూహకర్త, అగ్రశ్రేణి నాయకుడు అలీ లారిజానీ (Ali Larijani) తన బిడ్డింటికి పోవడమే అతని పాలిట శాపమైంది. అప్పటికే అతడిని టార్గెట్‌ చేసి నిఘా పెట్టిన ఇజ్రాయెల్ (Israel) అదే అదనుగా హతమార్చింది. టెహ్రాన్ శివార్లలోని తన కుమార్తె నివాసానికి లారిజానీ రహస్యంగా వెళ్లినప్పుడు ఈ దాడి జరిగింది. ఇరాన్‌ సుప్రీం లీడర్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నేత అయిన లారిజానీ మరణం ఇరాన్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది.

Read Also: Terrorist Attacks: భారత్‌లో ఉగ్రదాడులకు ప్లాన్- పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

Ali Larijani: How did Ali Larijani get caught?!

అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ తరచూ నివాసాలు మారుస్తూ లారిజానీ

యుద్ధం మొదలైనప్పటి నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ తరచూ నివాసాలు మారుస్తూ లారిజానీ శత్రువు కంటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే మార్చి 17న రాత్రి ఆయన తన కుమార్తె ఇంటికి వెళ్తున్నట్లు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ పక్కా సమాచారం సేకరించింది. బిడ్డ ఇంట్లోకి లారిజానీ ప్రవేశించిన కొన్ని క్షణాల్లోనే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ భీకర దాడిలో భవనం పూర్తిగా కుప్పకూలిపోవడంతో అలీ లారిజానీతోపాటు ఆయన కుమారుడు మొర్తెజా, కార్యాలయ అధిపతి బయట్ కూడా అక్కడికక్కడే మరణించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Ali Larijani Ali Larijani Arrest Iran News 2026 Iran political crisis Iran Power Struggle Middle East Politics Supreme Leader Advisor Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.