📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ali Khamenei: ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్

Author Icon By Saritha
Updated: March 5, 2026 • 5:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి భారతదేశం సంతాపం ప్రకటించింది. ఇరాన్ అధినేత ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో ఐదు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. ఇవాళ దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అధికారికంగా సంతాప సందేశం రాశారు. భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ కార్యదర్శి ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్లారు.

Read Also: Russia: భారత్‌కు ఆయిల్ ఇస్తాం.. రష్యా

Ali Khamenei: India officially condoles Khamenei’s death

సంతాప సందేశం రాసిన విక్రమ్ మిస్రీ

సంతాప సందేశాన్ని రాసిన అనంతరం మిస్రీ ఇరాన్ రాయబారితో కాసేపు మాట్లాడారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాల సంయుక్త వైమానిక దాడిలో ఖమేనీ మృతి చెందారు. ఖమేనీ మృతి అనంతరం పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ayatollah Ali Khamenei Death India Condolences US Israel Attack Vikram Misri Iran Embassy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.