📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Shoaib Akhtar: వాళ్లకున్న ధైర్యం మాకులేదని వాపోతున్న అక్తర్

Author Icon By Anusha
Updated: September 23, 2025 • 3:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవలి కాలంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆసియా కప్ 2025 (Asia Cup 2025) లో టీమిండియా చేతిలో రెండుసార్లు ఓటమి పాలవడం పాక్ అభిమానుల్లో నిరాశను కలిగించింది. ఈ పరిస్థితుల్లో ఆ దేశ మాజీ వేగవంతమైన బౌలర్, ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’ అని పిలువబడే షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) తన ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక క్రీడా చర్చా కార్యక్రమంలో షోయబ్ మాలిక్ (Shoaib Malik) అడిగిన ప్రశ్నకు సమాధానంగా అక్తర్ మాట్లాడుతూ, “భారత యువ ఆటగాడు అభిషేక్ శర్మకు లభిస్తున్న స్వేచ్ఛ, మద్దతు పాక్ ఆటగాళ్లకు అందడంలేదు. అందుకే వాళ్లు ఒత్తిడిలో తడబడుతున్నారు” అని వ్యాఖ్యానించారు. ఆటగాళ్లకు విశ్వాసం, స్వేచ్ఛ కల్పించకపోతే ప్రతిభ పెల్లుబకదని ఆయన సూచించారు.

జట్టును బాగుచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తనకు అవకాశం ఇస్తే జట్టును బాగుచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. అయితే, తాను సరైన నిర్ణయాలు తీసుకుంటాననే కారణంతో పీసీబీ (PCB) తనను ఎప్పటికీ సంప్రదించదని ఆయన పరోక్షంగా బోర్డుపై విమర్శలు గుప్పించాడు. “నాకు అధికారం ఇవ్వమని అడగడం లేదు. నేను టీమ్‌వర్క్‌ను, తర్కాన్ని నమ్ముతాను.

Shoaib Akhtar

అందరం కలిసి పనిచేయాలి. నేను 20 మంది సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసి, వారి సలహాలు తీసుకుంటాను” అని అక్తర్ వివరించాడు.ఆటగాళ్లకు భరోసా ఇవ్వడమే తన ప్రథమ కర్తవ్యమని అక్తర్ స్పష్టం చేశాడు. ఈ సంద‌ర్భంగా యువ ఆటగాడు సైమ్ అయూబ్ (Saim Ayub), భారత ఆటగాడు అభిషేక్ శర్మను ఉదాహరణగా చూపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతా

“నాకు మూడేళ్ల పాటు బాధ్యతలు అప్పగిస్తే, ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతా. ‘సైమ్.. నువ్వు వెళ్లి స్వేచ్ఛగా ఆడుకో. అభిషేక్ శర్మ (Abhishek Sharma) కు ఆడేందుకు లైసెన్స్ ఉంది, నువ్వు కూడా అలాగే ఆడు. ఔటైనా నిన్ను జట్టు నుంచి తీసేయరు. ఈ ఏడాది మొత్తం నీదే’ అని ధైర్యం చెబుతా.. మెరుగైన ప్రదర్శన ఎలా రాదో చూస్తా” అని అక్త‌ర్‌ అన్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

abhishek sharma Asia Cup 2025 Breaking News Cricket Strategy latest news Pakistan Cricket Team PCB Player Support Selection Committee Shoaib Akhtar Shoaib Malik Team India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.