📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Ajinkya Rahane: కరుణ్ నాయర్ వల్లే టీమిండియా ఓటమి

Author Icon By Anusha
Updated: July 16, 2025 • 4:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమిపాలవడంపై అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఈ ఓటమికి గల కారణాలను విశ్లేషించేటప్పుడు టాప్ ఆర్డర్ వైఫల్యం, రిషభ్ పంత్ (Rishabh Pant) రనౌట్, బౌలింగ్ లోపాలు చర్చకు వచ్చినా, మాజీ క్రికెటర్ అజింక్యా రహానే మాత్రం కరుణ్ నాయర్ రెండో ఇన్నింగ్స్‌లో విఫలమవడమే టర్నింగ్ పాయింట్‌గా పేర్కొనడం ఆసక్తికరంగా మారింది.ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. టెయిలెండర్స్ సాయంతో ఆఖరి వరకు రవీంద్ర జడేజా పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ గెలుపుతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. 193 పరుగుల లక్ష్యచేధన‌లో ఆదిలోనే యశస్వి జైస్వాల్ ఔటవ్వగా, కరుణ్ నాయర్‌తో కలిసి రాహుల్ ఆచితూ ఆడాడు.

యూట్యూబ్ ఛానెల్

క్రీజులో సెట్ అయిన తర్వాత బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో కరుణ్ నాయర్ ఎల్బీగా వెనుదిరిగాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమై మూల్యం చెల్లించుకున్నాడు.ఈ మ్యాచ్ ఫలితంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అజింక్యా రహానే, కరుణ్ నాయర్ (Karun Nair) వికెట్‌తోనే ఇంగ్లండ్‌ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందన్నాడు. ‘కరుణ్ నాయర్ వికెట్ ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌. ఆ సమయంలో భారత్ 40/1తో పటిష్టంగా కనిపించింది. కానీ కరుణ్ నాయర్ వికెట్‌ తర్వాత మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. ఇంగ్లండ్ గేమ్‌పై పట్టు బిగించింది. ఆ క్షణం నుంచి అద్భుతంగా బౌలింగ్ చేసింది. మైదానంలో, ఫీల్డింగ్‌లో ఇంటెన్సిటీ చూపించింది. గెలవాలనే కసితో బరిలోకి దిగింది.’అని అజింక్యా రహానే (Ajinkya Rahane) చెప్పుకొచ్చాడు.8 ఏళ్ల తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్.

Ajinkya Rahane: కరుణ్ నాయర్ వల్లే టీమిండియా ఓటమి

అవకాశాలను వృథా

వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. ఒక్క ఛాన్స్ అంటూ జట్టులోకి వచ్చిన అతను 6 అవకాశాలను వృథా చేశాడు. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 0, 20, ఎడ్జ్‌బాస్టన్‌లో 31, 20, లార్డ్స్ టెస్ట్‌లో 40, 14 రన్స్‌తో నిరాశపర్చాడు. మొత్తం 6 ఇన్నింగ్స్‌ల్లో 135 పరుగులు చేశాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో నాలుగో టెస్ట్‌ (Fourth Test) లో అతనికి చోటు దక్కడం సందేహంగా మారింది. కరుణ్ నాయర్‌ను తప్పించి అతని స్థానంలో సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్‌లను ఆడించే ఛాన్స్ ఉంది. జులై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది.

అజింక్యా రహానే ఎక్కడ జన్మించాడు?

అజింక్యా రహానే 1988 జూన్ 6న మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా, సంగమ్నేర్ తాలూకాలో ఉన్న అశ్వి కేడి అనే గ్రామంలో జన్మించాడు.

అజింక్యా రహానే మంచి క్రికెటర్ అని చెప్పవచ్చా?

అవును, అజింక్యా రహానే అనుభవజ్ఞుడైన, నైపుణ్యమైన ఆటగాడు. 2024-25 రంజీ సీజన్‌లో అతను 14 ఇన్నింగ్స్‌ల్లో 467 పరుగులు చేసి, 35.92 సగటుతో ఆడాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: King Charles: బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్‌ను కలిసిన భారత క్రికెట్ జట్లు

Ajinkya Rahane comments Breaking News India vs England 3rd Test Indian Batting Collapse Karun Nair LBW KL Rahul latest news Lord’s Test 2025 Team India loss Test series 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.