📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Latest Telugu News: Thai vs Cam: థాయ్‌లాండ్‌, కాంబోడియాల మధ్య వైమానిక దాడులు

Author Icon By Vanipushpa
Updated: December 8, 2025 • 11:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

థాయ్‌లాండ్‌- కాంబోడియా(Thailand -Cambodia) మధ్య మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. సోమవారం కంబోడియా దళాలు చేసిన దాడిలో ఒక థాయ్‌ సైనికుడు మృతిచెందగా అనేకమంది గాయపడ్డారు. ఆగ్రహించిన థాయ్‌లాండ్‌ సైన్యం కాంబోడియాపై భారీగా వైమానికి దాడులు చేపట్టింది. మిలిటరీ మౌలిక సదుపాయాలు, ఆయుధ డిపోలు, కమాండ్‌ సెంటర్లు లక్ష్యంగా వైమానిక దాడులు నిర్వహించింది. ముందు దాడి చేసింది మీరంటే మీరని రెండుదేశాలు ఆరోపించుకుంటున్నాయి. సరిహద్దు గ్రామాల ప్రజలను రెండు దేశాల సైన్యాలు ఖాళీ చేయిస్తున్నాయి. మొదట కంబోడియా దళాలు కాల్పులు జరిపినట్లు థాయ్‌లాండ్‌ సైనిక ప్రతినిధి మేజర్‌ జనరల్‌ వింథాయ్‌ సువారే తెలిపారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘర్షణ మొదలైనట్లు పేర్కొన్నారు. తమ దళాలకు చెందిన ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గాయపడినట్లు చెప్పారు.

Read Also: Nikita Nagdev: పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

Thai vs Cam

మరోవైపు ఈ వాదనను కంబోడియా రక్షణ మంత్రిత్వశాఖ తోసిపుచ్చింది. థాయ్ సైన్యమే మొదట కంబోడియా దళాలపై దాడి చేసిందని తెలిపింది. తొలుత ప్రహ్‌ విహియార్‌ ప్రావిన్స్‌లో కాల్పులు జరిపినట్లు పేర్కొంది. శాంతి, స్థిరత్వానికి ముప్పు కలిగించే అన్ని కార్యకలాపాలను థాయ్​లాండ్ వెంటనే ఆపాలని కోరింది. వెంటనే కవ్వింపు చర్యలు ఆపివేసి సరిహద్దుల్లో శాంతిస్థిరత్వానికి కట్టుబడి ఉందామని పిలుపునిచ్చింది. జూలైలో థాయ్‌లాండ్‌-కాంబోడియా మధ్య జరిగిన ఐదు రోజుల మినీ వార్‌లో డజన్ల సంఖ్యలో సైనికులు, పౌరులు మృతిచెందారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జోక్యం చేసుకుని రెండు దేశాల ప్రభుత్వాలను సంధికి ఒప్పించారు.

ఘర్షణలకు సరిహద్దు వివాదాలే కారణం

వాస్తవానికి ఈ ఘర్షణలకు సరిహద్దు వివాదాలే కారణమని చెబుతున్నారు. కానీ సరిహద్దుల్లోని హిందూ దేవాలయాల కోసం ఇరుదేశాలు ఎన్నో ఏళ్లుగా కొట్టుకుంటున్నాయి. ప్రధానంగా ప్రముఖ ఆలయాలు ఉన్న ప్రీహ్‌ విహార్‌, ట మోన్‌ థోమ్‌, ట మ్యూన్‌ థోమ్‌ ఉన్న పర్వతాలు, అరణ్యాలు కలగలిసిన ప్రాంతాల కోసం దశాబ్దలుగా ఇరుదేశాల మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. ఈ ఆలయాల్లో శివలింగం, సంస్కృత లిపిలో శాసనాలు, హిందూ దేవతల చిత్రాలు ఉన్నాయి. థాయిలాండ్‌, కంబోడియా మధ్య 508 మైళ్ల సరిహద్దు ఉంది. దీనిలో అత్యధిక భాగాన్ని ఫ్రాన్స్‌ పాలన కింద ఉన్నప్పుడే గుర్తించారు. రెండు దేశాలు శాంతియుతంగా కలిసి ఉంటున్నప్పటికీ, సరిహద్దుల్లో మాత్రం తరచూ ఘర్షణలతో జరగుతూనే ఉన్నాయి. వీటిల్లో 9వ శతాబ్దానికి చెందిన ప్రీహ్‌ విహార్‌ కీలకమైంది. ఈ శివాలయాన్ని ఖెమర్‌ పాలకులు నిర్మించారు. డాంగ్రెక్‌ పర్వతాల శిఖరం థాయ్‌లాండ్‌కు అత్యంత సమీపంలో ఉంటుంది. ఈ ఆలయం కంబోడియాకు చెందుతుందని 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దానిని థాయ్‌లాండ్‌ అంగీకరించింది. కానీ, ఆ దేవాలయం కేంద్రంగా స్థానిక సెంటిమెంట్లు వల్ల తరచూవివాదాలకు కారణమవుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Airstrikes Border conflict Breaking News in Telugu Cambodia defense news Google News in Telugu International Relations Latest In telugu news Military Clashes Southeast Asia tensions Telugu News Today Thailand

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.