📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

America: అమెరికాలో రన్‌వేపై బోల్తా పడ్డ విమానం

Author Icon By Vanipushpa
Updated: January 26, 2026 • 11:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(America) ను వణికిస్తున్న ఫెర్న్ మంచు తుపాను ఒక ఘోర విమాన ప్రమాదానికి కారణమైంది. మైనే రాష్ట్రంలోని బంగోర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆదివారం రాత్రి టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక ప్రైవేట్ బిజినెస్ జెట్ రన్‌వేపై అదుపుతప్పి బోల్తా పడింది. విమానం బోల్తా(Plane Crash) పడిన వెంటనే మంటలు చెలరేగడంతో విమానాశ్రయం ఒక్కసారిగా దట్టమైన పొగతో నిండిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7:45 గంటల ప్రాంతంలో ఒక సంఘటన జరిగిందని సమాచారం.

Read Also: iPhone 18 Pro price: ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్.. ధర ఎంతంటే?

America: అమెరికాలో రన్‌వేపై బోల్తా పడ్డ విమానం

బంగోర్ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేత

హ్యూస్టన్‌కు చెందిన ఒక కంపెనీకి చెందిన ఈ విమానం ప్రమాదానికి గురైన సమయంలో అందులో మొత్తం ఎనిమిది మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మైనస్ 16 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు, విపరీతమైన మంచు కురవడం వల్ల విజిబిలిటీ తగ్గి ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు బంగోర్ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేసి, విమాన సర్వీసులను రద్దు చేశారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాయి. కేవలం వాతావరణం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? లేక విమానంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా? అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

aircraft overturns Airport Accident aviation safety emergency landing flight mishap Passengers Safe plane accident runway incident Telugu News online usa aviation news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.