📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

Air India: ఎయిర్ ఇండియాకి బాంబు బెదిరింపు కలకలం..అత్యవసర ల్యాండింగ్

Author Icon By Shobha Rani
Updated: June 13, 2025 • 1:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా (Air India) విమానంలో ఈరోజు ఉదయం తీవ్ర కలకలం రేగింది. విమానంలో బాంబు ఉందన్న బెదిరింపు రావడంతో అప్రమత్తమైన పైలట్, విమానాన్ని వెనక్కి మళ్లించి ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు.
ప్రయాణికులను సురక్షితంగా..
ఏరోనాటికల్ రేడియో ఆఫ్ థాయ్‌లాండ్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం… ఎయిర్ ఇండియా(Air India) కు చెందిన ఏఐ 379 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్‌కు బాంబు బెదిరింపు గురించి సమాచారం అందింది. దీంతో ఆయన వెంటనే ఫుకెట్‌కు తిరిగి వెళ్లేందుకు అనుమతి కోరారు. ఫుకెట్ విమానాశ్రయ అధికారులు తక్షణమే స్పందించి, ఎయిర్‌పోర్ట్ కంటింజెన్సీ ప్లాన్‌ను అమలులోకి తెచ్చారు. బాంబు బెదిరింపుల సమయంలో అనుసరించాల్సిన నిర్దేశిత అత్యవసర నిబంధనల ప్రకారం ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి దించివేసి, సురక్షిత ప్రాంతానికి తరలించారు.
బాంబు లేదు.. కానీ బెదిరింపు నోటు లభ్యం
అనంతరం అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రాథమిక సోదాల్లో ఎలాంటి బాంబు లభ్యం కాలేదని తాజా సమాచారం ద్వారా తెలిసింది. అయితే, విమానంలో ఒక బాంబు బెదిరింపు నోటు దొరికిందని అధికారులు ధ్రువీకరించారు. ఆ నోటును ఎవరు రాశారు, దానిని ఎవరు గుర్తించారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ నోటును కనుగొన్న ప్రయాణికుడిని అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.

Air India: ఎయిర్ ఇండియాకి బాంబు బెదిరింపు కలకలం..అత్యవసర ల్యాండింగ్

గత ఏడాది 1,000 పైగా తప్పుడు బెదిరింపులు
గత కొంతకాలంగా భారతీయ విమానయాన సంస్థలు, విమానాశ్రయాలకు నకిలీ బాంబు బెదిరింపులు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. గతేడాది తొలి పది నెలల్లోనే దాదాపు 1,000 వరకు ఇలాంటి తప్పుడు కాల్స్, సందేశాలు అందాయని, ఇది 2023లో నమోదైన సంఖ్య కంటే దాదాపు పది రెట్లు ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఘటన మరోసారి ఆందోళన కలిగించింది.
రవాణా మంత్రిత్వ శాఖ – ఫుకెట్ అధికారులు ప్రకటన
రవాణా మంత్రిత్వ శాఖ, ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు అన్ని అవసరమైన భద్రతా చర్యలు తీసుకున్నామని, పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని వారు వెల్లడించారు. ఎలాంటి అసాధారణ వస్తువులు లభ్యం కాలేదని అధికారిక సమాచారం. సంఘటనపై విస్తృత స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేశారు.
ప్రయాణికుల స్పందన
ప్రయాణికులలో అసహజ భయం, గందరగోళం, అధికారులు వెంటనే స్పందించడంతో గాఢనాభూతి తగ్గింది. భద్రతా చర్యలపై ప్రశంసలు: “ఇది ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది” అనే అభిప్రాయాలు. ఈ ఘటన మరోసారి భద్రతపై అసాధారణ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని బలంగా చాటింది. అంతేగాకుండా, ప్రతి బెదిరింపినీ గంభీరంగా తీసుకొని వెంటనే స్పందించడంలో ఎయిర్ ఇండియా (Air India), ఫుకెట్ అధికారులు చూపిన అప్రమత్తత ప్రశంసనీయం.

Read Also: India China flights: త్వరలో భారత్ – చైనా మధ్య ప్రత్యక్ష విమాన

Air India faces bomb threat Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu makes emergency landing Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.