📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

Anthropic AI: టెక్ కంపెనీలను వణికిస్తున్న ఏఐ టూల్ ఇదే!

Author Icon By Vanipushpa
Updated: February 4, 2026 • 1:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచవ్యాప్తంగా ఏ రంగం ఎలా ఉన్నా.. సాఫ్ట్ వేర్ రంగం మాత్రం కాస్త స్థిరంగా ఉంటుంది. అయితే రీసెంట్ గా ఆంథ్రోపిక్ (Anthropic) అనే సంస్థ చేసిన ఒక ప్రకటన.. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాన్ని కుదిపేసింది. అంతేకాదు దిగ్గజ ఐటీ కంపెనీల ఆర్థిక మార్కెట్లను కూడా షేక్ చేసింది. ‘క్లాడ్’ ఏఐ చాట్‌బాట్ కోసం 11 కొత్త ప్లగిన్‌లను ఆంథ్రోపిక్ విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా ‘లీగల్’ రంగానికి సంబంధించిన ఏఐ టూల్, సాఫ్ట్‌వేర్ , ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీల భవిష్యత్తుపై నీలినీడలు కమ్మి వచ్చేలా చేసింది. దీని ప్రభావంతో ఒకే రోజులో గ్లోబల్ సాఫ్ట్‌వేర్ స్టాక్స్ నుంచి 285 బిలియన్ డాలర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. అసలు ఏంటా టూల్? ఎందుకు ఈ భయం? ఆంథ్రోపిక్ విడుదల చేసిన ‘క్లాడ్ కోవర్క్’ (Claude Cowork) అనేది ఒక ఏజెంటిక్ ఏఐ అసిస్టెంట్. అంటే ఇది కేవలం సమాచారం ఇవ్వడమే కాదు. క్లిష్టమైన పనులను కూడా పూర్తి చేస్తుంది. ముఖ్యంగా లీగల్ ప్లగిన్ ద్వారా కాంట్రాక్టుల రివ్యూ, డాక్యుమెంట్ల తయారీ, కంప్లయన్స్ చెక్స్ వంటి పనులను క్షణాల్లో పూర్తి చేయవచ్చు.

Read Also: USA: టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్.. ప్రధాని మోదీ హర్షం

AI: టెక్ కంపెనీలను వణికిస్తున్న ఏఐ టూల్ ఇదే!

భారత్‌లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ

భారత ఐటి కంపెనీలపై ప్రభావం భారతదేశానికి ఐటి రంగానికి వెన్నెముక వంటిది. అమెరికా మార్కెట్లలో సాఫ్ట్‌వేర్ షేర్లు పడిపోవడంతో దాని సెగ భారత ఐటి దిగ్గజాలకు కూడా తగిలింది. ఫిబ్రవరి 4న భారత స్టాక్ మార్కెట్లో నిఫ్టీ ఐటి ఇండెక్స్ 7% పైగా పతనమైంది. ఇన్ఫోసిస్, ఎల్‌టిఐ మైండ్‌ట్రీ వంటి కంపెనీల షేర్లు 8% వరకు క్షీణించాయి. టిసిఎస్, హెచ్‌సిఎల్ టెక్, విప్రో వంటి టాప్ కంపెనీల మార్కెట్ విలువ కూడా భారీగా తగ్గింది. భారత ఐటి రంగం నుంచి కేవలం ఒకే రోజులో రూ. 2 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఆవిరైపోయింది. ఐటి సేవల భవిష్యత్తు మారుతుందా? ఇన్నాళ్లు సాఫ్ట్‌వేర్ కంపెనీలు ‘ఎఫర్ట్- బేస్డ్ బిల్లింగ్’ (ఎంతమంది పని చేస్తున్నారు, ఎన్ని గంటలు పని చేస్తున్నారు అనే దానిపై డబ్బులు తీసుకోవడం) చేసేవి.

ఏఐ వల్ల పనులు సులభతరం

ఈ పతనాన్ని కొందరు నిపుణులు ‘సాస్‌పోకలిప్స్’ అని పిలుస్తున్నారు. అయితే ఇది కేవలం తక్షణ ఆందోళన వల్ల జరిగిన రియాక్షన్ అని, దీర్ఘకాలంలో ఐటి కంపెనీలు ఏఐని అందిపుచ్చుకుని మళ్ళీ పుంజుకుంటాయని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏఐ వల్ల పనులు సులభతరం అవుతాయని, అయితే దానికి తగ్గట్టుగా కంపెనీలు తమ బిజినెస్ మోడల్‌ను మార్చుకోవాల్సి ఉంటుందని వారు సూచిస్తున్నారు. టెక్నాలజీ మారుతున్న కొద్దీ పాత పద్ధతులు మాయమై కొత్తవి వస్తాయని, ఇది అందులో ఒక భాగమేనని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఏదేమైనా ఆంథ్రోపిక్ సృష్టించిన ఈ అలజడి ఐటి రంగంలో ఒక మేలుకొలుపు వంటిది. టెక్నాలజీ అనేది అభివృద్ధికి తోడ్పడుతుందని భావించిన వారు.. ఇప్పుడు అది తమ ఉనికికే ముప్పుగా మారుతుందేమోనని ఆలోచిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AI innovation AI tools Artificial Intelligence Impact automation tools future of tech jobs SBA technology tech companies disruption Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.