ఈ నెల 19, 20 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ (AI Summit) ప్రపంచవ్యాప్తంగా విస్తృత ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఈ సమ్మిట్‌లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ ఫౌండర్ శామ్ ఆల్ట్‌మన్ పాల్గొననున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు అనేక దేశాల నుంచి ప్రతినిధులు వస్తుండటంతో ఢిల్లీలోని హోటల్ గదుల ధరలు విపరీతంగా పెరిగాయి. సాధారణంగా రూ.2 లక్షలు ఉండే లగ్జరీ సూట్ ధర ఇప్పుడు రూ.32 లక్షలకు చేరింది. ఈ సమ్మిట్‌కు దాదాపు 100 దేశాల నుంచి 35 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.. గ్లోబల్ సౌత్ దేశాల్లో నిర్వహించే తొలి ఏఐ సమ్మిట్ ఇదే కావడం విశేషం.
Read Also: House : వామ్మో.. 500 ఎకరాల్లో ఇల్లు.. ఎక్కడుందో తెలుసా?
సమ్మిట్ రోజుల్లో రూమ్ రెంట్లు 2-3 రెట్లు పెరిగాయి
ఫిబ్రవరి 16-17 తేదీలకు చాలా లగ్జరీ కేటగిరీ గదులు ఇప్పటికే సోల్డ్ అవుట్ అయ్యాయి.
లీలా ప్యాలెస్‌లో మహారాజా సూట్‌కు రూ.6-7 లక్షల వరకు ధర ఉండగా,ఒబెరాయ్, అండాజ్ వంటి హోటళ్లలోనూ లక్షల రూపాయల రేట్లు ఉన్నాయి.లలిత్, జయపీ వసంత్ కాంటినెంటల్, ఈరోస్ హోటల్ లాంటి వాటిలో దాదాపు పూర్తి స్థాయి ఆక్యుపెన్సీ నమోదవుతోంది.దేశ విదేశాల నుంచి వేలాది ప్రతినిధులు, విధాన నిర్ణేతలు, కార్పొరేట్ నేతలు ఢిల్లీకి రావడంతో, జనవరి,ఫిబ్రవరి మొదటి భాగంతో పోలిస్తే సమ్మిట్ రోజుల్లో రూమ్ రెంట్లు 2-3 రెట్లు పెరిగాయని హోటల్ పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: