మన జీవితాల్లోకి వేగంగా దూసుకొస్తున్న స్మార్ట్ టెక్నాలజీ.. అంతే వేగంతో మన బతుకులను బజారు పాలు చేస్తున్నదనేందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.. ఏఐ గ్లాసెస్! మీరు ఏఐ కళ్ల జోడు(AI Glasses) పెట్టుకొని కొందరిని చూస్తూ ఉంటారు. మీ వెనుక ఎవరూ లేరు. మీ చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు. నేనొక్కడినే చూస్తున్నాను.. అనుకోవచ్చు! కానీ.. కాదు. మీరు ఒంటరిగా లేరు.. మీరు చూసే దృశ్యాలను మరో వ్యక్తి కూడా చూస్తున్నాడు. మీరు చూసే దృశ్యాలు మరో దేశంలో రికార్డు అవుతూ ఉంటాయి! మీ కళ్లు దేన్ని చూస్తే వేరే వ్యక్తి కూడా అవే చూస్తాడు. అది మీ బెడ్‌రూమ్ అయినా.. బాత్‌రూమ్ అయినా కూడా! నమ్మలేక పోతున్నారా? కృత్రిమ మేధను జోడించి మెటా తీసుకొచ్చిన మెటా రేబాన్ కళ్లజోళ్లు… మీరు చూసే దృశ్యాలను ఆటోమేటిక్‌గా మీకు తెలియని వ్యక్తులు కూడా చూసే అవకాశం ఉంది!
Read Also: US Iran Conflict: ఇరాన్ నౌకను ధ్వంసం చేసిన అమెరికా
కెన్యాలోని నైరోబీలోని సబ్ కాంట్రాక్ట్ సంస్థ
ఈ మెటా రేబాన్ గ్లాసెస్‌ను వినియోగించడం చాలా సులభం. మనం ఏదైనా దృశ్యాన్ని చూసే సమయంలో ‘“Hey Meta” అని పలికి.. దానిని విశ్లేషించమని అడిగితే.. ఆ వీడియో మెటా సర్వర్లకు వెళిపోతుంది. అక్కడి నుంచి సామాకు చేరుతుంది. ఇది కెన్యాలోని నైరోబీలోని సబ్ కాంట్రాక్ట్ సంస్థ. ఇక్కడి వర్కర్లు సదరు గ్లాసెస్ ధరించిన వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా లేదా యాదృచ్ఛికంగా ఏమైతే రికార్డు చేశారో ఆ వీడియోలన్నీ అక్కడ చూస్తారు. వాటిని మ్యాన్యువల్‌గా లేబుల్ చేస్తారు. కెన్యాలోని మెటా కంపెనీ వర్కర్లను మెటా రేబాన్ గ్లాసెస్ ద్వారా రికార్డయిన విజువల్స్‌ను విశ్లేషించాలని చెబితే.. ఆ వర్కర్లే ఆ దృశ్యాలు చూసి ఇబ్బంది పడ్డారట! ఈ మేరకు ఒక పరిశోధనాత్మక కథనాన్ని స్వీడన్‌కు చెందిన స్వెన్స్‌కా డాగ్బ్లాడెట్, గొటెన్‌బోర్గ్స్ పోస్టెన్ పత్రికలు పబ్లిష్ చేశాయి. కెన్యాలో మెటా వర్కర్లు ఎనలైజ్ చేసిన వీడియోల్లో.. గ్లాసెస్ ధరించినవారు చూసిన ఇంటిమేట్ సన్నివేశాలు.. ఆఖరుకు డిస్ట్రబింగ్ దృశ్యాలు సైతం ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు.. ఆ గ్లాసెస్ పెట్టుకొని మొబైల్‌లో బ్యాంకు లావాదేవీలు నిర్వహించినప్పుడు యూజర్ నేమ్స్, పాస్‌వర్డ్స్ కూడా మరొకరి కళ్లముందే కనిపిస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :