AI job loss : కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల భవిష్యత్తుపై కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే 12 నుంచి 18 నెలల్లో వైట్ కాలర్ ఉద్యోగాల్లో పెద్దఎత్తున ఆటోమేషన్ జరిగే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం అధిపతి ముస్తఫా సులేమాన్ హెచ్చరించిన విషయం చర్చనీయాంశమైంది. కంప్యూటర్ ముందు కూర్చుని చేసే పనులు అకౌంటింగ్, లీగల్ సేవలు, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటి అనేక రంగాలపై AI ప్రభావం పడనుందని నిపుణులు చెబుతున్నారు.
ఇదే సమయంలో హైపర్‌రైట్ సీఈవో మాట్ షుమర్ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం రేపుతున్నాయి. “Something Big Is Happening” పేరుతో ఆయన రాసిన వ్యాసంలో, AI ప్రభావాన్ని కోవిడ్-19 మహమ్మారితో పోల్చారు. 2020లో కోవిడ్‌ను మొదట ప్రపంచం చిన్న సమస్యగా తీసుకున్నట్టే, ఇప్పుడు AI మార్పులను కూడా చాలామంది తక్కువ అంచనా వేస్తున్నారని హెచ్చరించారు. భవిష్యత్తులో AI ప్రభావం కోవిడ్ కన్నా పెద్ద మార్పులకు దారితీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: CM Chandrababu: నీటి సమస్యలపై చర్చకు సిద్ధంగా ఉన్నాం
స్క్రీన్ ఆధారిత ఉద్యోగాలు కోడింగ్, రైటింగ్, డేటా అనాలిసిస్, కస్టమర్ సపోర్ట్ వంటి పనులు వేగంగా మారిపోతాయని, ముఖ్యంగా ఎంట్రీ లెవల్ ఉద్యోగాల్లో 50% వరకు తగ్గుదల ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పాత AI వ్యవస్థలు కేవలం సూచనలు పాటించేవి కాగా, తాజా మోడల్స్ స్వయంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటున్నాయని చెబుతున్నారు. అందుకే AIని కేవలం సెర్చ్ టూల్‌గా కాకుండా, పని సామర్థ్యాన్ని పెంచే సాధనంగా ఉపయోగించడం నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: