📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ మానవాళిని అంతం చేస్తుంది: గాడ్‌ఫాదర్‌ ఆఫ్‌ ఏఐ

Author Icon By Vanipushpa
Updated: August 16, 2025 • 5:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)(artificial intelligence) రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే ఏఐ వల్ల అనేక కంపెనీలు లేఆఫ్‌(Layoffs)లు ప్రకటిస్తున్నాయి. దీంతో లక్షలాది ఉద్యోగాలు పోతున్నాయి. ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియక ఐటీ ఉద్యోగులు(IT Employees) ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏఐ ఐటీతో సహా దాదాపు అన్ని రంగాల్లోకి వ్యాపించింది. రాబోయే రోజుల్లో దీని వినియోగం మరింత పెరగనుందని.. దాదాపు అన్ని పనులు ఏఐ ద్వారానే జరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఏఐని సరిగ్గా వినియోగించకపోతే ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ మానవాళిని అంతం చేస్తుంది: గాడ్‌ఫాదర్‌ ఆఫ్‌ ఏఐ

మానవాళిని తుడిపెట్టేసే అవకాశం వుంది: జాఫ్రీ హింటన్
గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐగా గుర్తింపు పొందిన జాఫ్రీ హింటన్ కూడా తాజాగా ఏఐపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెవడాలోని లాస్‌వెగాస్‌ జరిగిన ఏఐ4 సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవాళిని తుడిపెట్టేసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. దీన్ని నివారించేందుకు భావోద్వేగపూరితమైన ఏఐ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. మానవుల సంరక్షణ అంశంపై వాటికి అవగాహన కల్పించాలని సూచనలు చేశారు.
రాబోయే రోజుల్లో ఏఐ మానవ మేదస్సును అధికమిస్తుంది
ఏఐ వ్యవస్థలు ప్రస్తుతానికైతే మానవుల నియంత్రణలోనే ఉన్నాయని చెప్పారు. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని చెప్పలేమన్నారు. రాబోయే రోజుల్లో ఏఐ మానవ మేదస్సును అధిగమిస్తే.. ఇది ఇతర మార్గాలు అన్వేషిస్తుందని తెలిపారు. అంతేకాదు ఇటీల ఓ వ్యక్తి రస్యాలు బయటకు చెప్పేస్తానని ఏఐ బెదిరించిన విషయాన్ని కూడా వివరించారు. అందుకోసమే ఏఐ వ్యవస్థను భావోద్వేగ స్పందనలు కలిగి ఉండేలా రూపొందించడం మంచిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల మానవాళికి ఎలాంటి ప్రమాదం ఉండదని వెల్లడించారు.

నేడు AI ఎలా ఉపయోగించబడుతోంది?
ఆధునిక జీవితంలోని అనేక అంశాలలో AI ఉపయోగించబడుతుంది, తరచుగా ప్రజలు గ్రహించకుండానే. ఇది ఆన్‌లైన్ షాపింగ్‌లో వ్యక్తిగతీకరించిన సిఫార్సులకు శక్తినిస్తుంది, భాషా అనువాదంలో సహాయపడుతుంది, శోధన ఇంజిన్ ఫలితాలను మెరుగుపరుస్తుంది మరియు స్మార్ట్ హోమ్‌లు మరియు రవాణాలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది.
AI మంచిదా చెడ్డదా?
AI అనేది సహజంగానే మంచిది కాదు లేదా చెడ్డది కాదు; దాని ప్రభావం దానిని ఎలా అభివృద్ధి చేసి ఉపయోగిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/fastag-fastag-annual-pass-is-getting-huge-collections/national/531180/

AI Godfather Artificial intelligence Future of AI Geoffrey Hinton Human Extinction Latest News Breaking News Technology Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.