हिन्दी | Epaper
కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంలో 125 మృతదేహాల గుర్తింపు

Sharanya
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంలో 125 మృతదేహాల గుర్తింపు

అహ్మదాబాద్ (Ahmedabad) నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ శివారులో కూలిపోయిన ఘటన దేశాన్ని విషాదంలో ముంచేసింది. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 274 మంది దుర్మరణం పాలవ్వడం ఈ ప్రమాదాన్ని ఒక యుగాంత సంఘటనగా మార్చింది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సహా పలు ప్రముఖులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని కలిగించింది.

125 మృతదేహాల గుర్తింపు: డీఎన్ఏ పరీక్షల వేగవంతం

ఈ ప్రమాదం తర్వాత మృతుల అవశేషాలు పూర్తిగా కాలిపోయిన పరిస్థితిలో ఉండటంతో వారి గుర్తింపు అత్యంత క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో స్పెషల్ ఫోరెన్సిక్ బృందాలు, డీఎన్ఏ పరీక్షల ఆధారంగా గుర్తింపు ప్రక్రియ చేపట్టాయి. ప్రమాదం జరిగిన మూడ్రోజుల తర్వాత కూడా మృతదేహాల గుర్తింపు ఆలస్యం కావడంతో బంధువుల ఆవేదన పెరిగిపోయింది.

శాంపిల్స్ సేకరించిన 72 గంటల తర్వాత మృతదేహాలు అప్పగిస్తామని చెప్పిన సిబ్బంది 84 గంటలు గడిచినా అందజేయకపోవడంతో అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి వద్దే బంధవులు, కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. ఇలాంటి సమయంలోనే కొందరిరి ఊరట కల్గించే వార్త వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ప్రమాదంలో దుర్మరణం పాలైన 125 మంది మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ద్వారా విజయవంతంగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే 83 మృతదేహాలను కూడా వారి కుటుంబ సభ్యులకు అప్పగించేశారు.

DNA పరీక్ష ద్వారా మృతదేహాల గుర్తింపు

125 మృతదేహాలలో ఇప్పటికే 83 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. అలాగే మిగాత మృతదేహాల అప్పగింత కూడా జరుగుతోందని చెప్పారు. తమ వారి ఆచూకీ తెలియక ఆస్పత్రి వద్దే ఇంకా వందలాది మంది వేచి చూస్తుండగా వైద్య సిబ్బంది DNA పరీక్షలను మరింత వేగవంతం చేసింది. రాత్రి, పగలనే తేడా లేకుండా 24 గంటలూ DNA పరీక్షలు చేస్తూనే ఉంది. ప్రతీ ఒక్కరికీ వీలయినంత త్వరగా వారి వారి మృతదేహాలను అందజేయాలని తీవ్రంగా కృషి చేస్తోంది.

భారీ పరిహారం ప్రకటించిన టాటా సన్స్

విమాన ప్రమాదంలో మొత్తం 274 మంది మరణించినట్లు అధికారికంగా ధృవీకరించబడింది. అయితే ప్రమాదం సంభవించిన రోజే టాటా సన్స్ గ్రూప్ మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్ట పరిహారం ప్రకటించింది. అలాగే ఎయిరిండియా సంస్థ మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల మధ్యంతర పరిహారం అందజేయనున్నట్లు వివరించింది. విమానం కూలిన ఘటనపై NIA, DGCA, AAIB వంటి సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ ప్రమాదంలోనే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సైతం ప్రాణాలు కోల్పోయారు.

Read also: Covid: హమ్మయ్యా..తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870