గురువారం అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం దృశ్యం
బ్లాక్ బాక్స్
పక్షులు ఢీకొనడంవల్లే కూలిపోయిందా?
అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిరిండియా బోయింగ్ మైనర్ విమానానికి సంబంధించి బ్లాక్బాక్స్ ను రికవరీచేసేందుకు డిజిసిఎ అధికారులు కృషిచేస్తున్నారు. అటు సర్దార్పటేల్ ఎయిర్పోర్టు అధికారులతోపాటు, టాటా ఎయిరిండియా అధికారులు కూడా బ్లాక్బాక్స్ స్వాధీనం అయితే ప్రమాదానికి గల అసలు కారణాలు తెలుస్తాయని చెపుతున్నారు. బ్లాక్ బాక్స్ అనేది విమానం పనితీరు, పైలట్లమధ్య సంభాషణలను రికార్డుచేసేందుకు ఈ బాక్స్ ఏర్పాటుచేస్తారు. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ రెండు భాగాలను బ్లాక్ బాక్స్ గా పరిగణిస్తారు. ఫ్లైట్ డేటా రికార్డర్ విమానం ఎంత ఎత్తులో ఉంది. ఎంతవేగంతో ప్రయాణిస్తోంది. ఫ్లైట్ కంట్రోల్స్ పనితీరును రికార్డుచేస్తుం ది. ఫ్లైట్ డేటా రికార్డర్ ఎత్తు వేగం ఇంజిన్ స్ట్ ఫ్లైట్ పాత్ డేటాతోసహా మొత్తం ముఖ్యమైన టెక్నికల్ పారామీ టర్స్ అన్నీ నమోదుచేస్తుంది. ఇక కాక్పిట్ వాయిస్ రికార్డర్ పైలట్లమధ్య సంభాషణలు ఎటిసినుంచి వచ్చే ఆదేశాలు సేకరిస్తుంది. ఈ బాక్స్ లబిస్తే విమానప్రమాదానికి కారణాలు తెలుస్తాయి ఈ బ్లాక్ బాక్సులు అత్యంత దృఢంగా ఉంటాయి. ఎలాంటి ప్రమాదం అయినా తట్టుకుంటాయి.
ప్రకాశవంతమైన నారింజరంగులో ఉంటే ఈ బాక్స్ పేలుళ్లు, మంటలు, నీటిపీడనం, విమాన ప్రమాదంలో మరణించిన పైలట్లు హైస్పీడ్ క్రాష్లను కూడా తట్టుకుంటుంది. 25 గంటల ఫ్లైయిట్ సమాచారాన్ని రికార్డుచేసి ఈ బ్లాక్బాక్స్ భద్రపరుచుకునే సామర్థ్యంతో ఉంటుంది.
వైమానికరంగంలో పనిచేసిన సీనియర్ పైలట్ కెప్టెన్ సౌరభ్ భట్నాగర్ బహుశా పక్షలు ఢీకొనడంవల్ల రెండు ఇంజన్లు శక్తిని కోల్పోయి ఉంటాయన్న అనుమానం వ్యక్తంచేసారు. టేకాఫ్ బాగానే ఉందని, లానయండింగే గేర్ పైకి లేవడానికి ముందే విమానం కిందకు దిగుతున్నట్లు కనిపించిందన్నారు. ఇది ఇంజిన్ వైఫల్యాన్ని సూచిస్తోందని, విమానానికి లిఫ్ట్ అయ్యేందుకు కావాల్సిన శక్తిలేకపోవడంవల్లే జరిగినట్లు కనిపిస్తున్నదన్నారు. టేకాఫ్ అసమానంగా జరిగిందని, నియంత్రణలేకుండా కిందకు వచ్చిందని అందువల్లనే పైలట్ మేడేకాల్చేసినట్లు స్పష్టం అవుతోందన్నారు. టేకాఫ్ సమయంలో పక్షులు ఢీకొట్టి ఉంటే, ఆరేడు నిమిషాల తర్వాత పడిపోవడం ప్రారంభం అయి ఉండవచ్చని అంచనావేసారు. ఇది చాలా కొత్త విమానం అని చెపుతూనే 11 ఏళ్ల విమానంకాబట్టి సాంకేతికసమస్యలు కూడా తక్కువగానే ఉండవచ్చని అంచనావేసారు.
విమానం కూలిపోయిన ఘటనపై సిఎం రేవంత్రెడ్డి విచారం
హైదరాబాద్, జూన్ 12: అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన దుర్ఘటనపై ముఖ్య మంత్రి రేవంత్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో దాదాపు 200 మందికిపైగా ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారనే సమాచారం తెలియటంతో.. అందరూ సురక్షితంగా ఉండాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు. బాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి వీలైనంత వేగంగా సమర్థవంతంగా సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విమాన ప్రమాద ఘటనపై అసెంబ్లీ స్పీకర్ దిగ్భ్రాంతి అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో పెద్ద ఎత్తున ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు స్పీకర్ ప్రసాద్ కుమార్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరితంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విమాన ప్రమాదం పట్ల కెసిఆర్ దిగ్భ్రాంతి ప్రభాతవార్త ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్, జూన్ 12: గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నివాసాల మీద విమానం కూలడంతో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రయాణికులు, సామాన్యులు, సహా వైద్య విద్యార్థులు మరణించడం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ, సంతాపాన్ని ప్రకటించారు.
మరణించిన కుటుంబాలను ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆర్థికంగా ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కేసీఆర్ కోరారు. తమ ఆప్తులను కోల్పోయి శోకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పవిత్రమైన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలి: హరీశ్రవు అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట -ఎమ్మెల్యే హరీశావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలిపోవడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతూ.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పేర్కొన్నారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు బలం చేకూరాలని, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని హరీశ్ రావు పేర్కొన్నారు.