పంజాబ్‌లోని మూడు సరిహద్దు ప్రాంతాల్లో ఇవాళ బీటింగ్ రిట్రీట్ (Beating Retreat) కార్యక్రమం పునరుద్ధరించబడింది. ఇది గత 10 రోజుల కాలంలో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ (ceasefire) అమలులో ఉన్న నేపథ్యంలో జరిగింది .
ఈ రోజు, పంజాబ్‌లోని మూడు ముఖ్యమైన సరిహద్దు చెక్‌పోస్టులైన అత్తారీ (Amritsar), హుస్సైనివాలా (Ferozepur), మరియు సాదికీ (Fazilka) వద్ద బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం పునరుద్ధరించబడింది. ఈ కార్యక్రమం భారత సరిహద్దు భద్రతా దళం (BSF) మరియు పాకిస్తాన్ రేంజర్లు సంయుక్తంగా నిర్వహించే సాంప్రదాయ కార్యక్రమం.
కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం
బీటింగ్ రిట్రీట్ సమయంలో పాకిస్థానీ వైపు ఉన్న బోర్డర్ గేట్లను తెరవబోమని అధికారులు చెప్పారు. ఇక పాక్ సిబ్బందితో కరచాలనం ఉండదన్నారు. కానీ బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని వీక్షించే అవకాశాన్ని ప్రేక్షకులు కల్పించారు. ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది. అమృత్‌సర్‌కు సమీపంలో ఉన్న అత్తారి బోర్డర్‌తో పాటు ఫిరోజ్‌పుర్‌లోని హుస్సేనివాలా, ఫజిల్కాలోని సద్కి బోర్డర్ వద్ద బీటింగ్ రిట్రీట్ ఉంటుంది. 5.30 నిమిషాలకు భారీ సంఖ్యలో సద్కీ బోర్డర్‌కు చేరుకోవాలని స్థానికులకు బోర్డర్ ఏరియా డెవలప్మెంట్ ఫ్రంట్ పిలుపునిచ్చింది.
అత్తారి బోర్డర్ వద్ద 1959 నుంచి బీటింగ్ రిట్రీట్‌ను నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో రెండు దేశాల జాతీయ పతాకాలను అవనతనం చేస్తారు. సాధారణంగా బోర్డర్ వద్ద దివాళీ, ఈద్, గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ రోజుల్లో స్వీట్లు పంచుకుంటారు. అమృత్‌సర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో, లాహోర్‌కు 22 కిలోమీటర్ల దూరంలో అత్తారి-వాఘా బోర్డర్ ఉన్నది. ఇక్కడ బీటింగ్ రిట్రీట్ సెర్మనీ వీక్షించేందుకు 25 వేల మంది సామర్థ్యం కలిగిన గ్యాలరీ ఉన్నది.
Read Also : India-Pak War : 64 మంది పాక్ సైనికులు, అధికారులు మృతి – ఇండియన్ ఆర్మీ