📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Africa: రొమాన్స్ స్కామ్ ముఠాలపై స్టింగ్ ఆపరేషన్.. వందల్లో అరెస్టులు

Author Icon By Pooja
Updated: September 27, 2025 • 4:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ శృతిమించిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలకు పాల్పడుతూ అందినకాడికి దోచేసుకుంటున్నారు. పద్నాలుగు ఆఫ్రికన్ దేశాల్లో నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో 260మంది అనుమానిత సైబర్ మోసగాళ్లను అరెస్టు చేశారు. యూకే నిధులతో, ఇంటర్ పోల్ ఒక ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో సోషల్ మీడియా, ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ల(Online platforms) ద్వారా మోసాలకు పాల్పడేవి. ఘనా, కెన్యా, అంగోలా ఇతర ప్రాంతాలలో 1,400 మందికిపైగా బాధితులను గుర్తించారు. వారంతా దాదాపు 2.8 మిలియన్ డాలర్లు (రూ.23 కోట్ల నుంచి రూ.24 కోట్ల వరకు నష్టపోయినట్లు ఇంటర్ పోల్ అంచనా వేసింది.

Read Also: Brazil: కొండపై కారులో రొమాన్స్.. చివరకు ఏమైంది!

ఇంటర్ పోల్ తెలిపిన వివరాల ప్రకారం..

జులై నుంచి ఆగస్టు మధ్య జరిపిన దాడుల్లో వివిధ వయసుల వారు ఈ మోసగాళ్ల బారిన పడినట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్ లో మోసగాళ్ల గ్యాంగులతో సంబంధమున్న వారి ఐపీ అడ్రెస్ లు, సాంకేతిక పరికరాలు, డొమైన్లు, సోషల్ మీడియా ప్రొఫైళ్లను గుర్తించారు. వీటి ఆధారంగా జరిగిన అరెస్టుల అనంతరం యూఎస్బీ డ్రైవ్ లు, సిమ్ కార్డులు, నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు ఆఫ్రికా వ్యాప్తంగా 81 సైబర్ నేరగాళ్ల గ్యాంగులను కట్టడి చేసినట్లు ఇంటర్ పోల్ తెలిపింది.

ఆన్లైన్ ద్వారా బాధితులపై దాడి చేసే గ్యాంగులను నివారంచడం, వాటిని నిర్వీర్యం చేయడమే మా ప్రధాన లక్ష్యం’ అని పేర్కొంది. ‘సెక్స్ టార్షన్, రొమాన్స్ స్కామ్ లవంటి సైబర్ నేరాల్లో ఆఫ్రికా అంతటా గణనీయమైన పెరుగుదల నమోదైందని సైబర్ -నేర విభాగాల ని వేదికల ద్వారా తెలుస్తోంది’ అని ఇంటర్ పోల్ లో పోలీస్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిరిల్ గౌట్ తెలిపారు.

ఘనాలో 68 మంది అరెస్టులు

ఘనాలో దాదాపు 68 మంది అనుమానితులను అరెస్టు చేశారు. అక్కడ 835 పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ సమయంలో 108మంది బాధితులను గుర్తించారు. బాధితులు దాదాపు 450,000 (రూ 4కోట్లు కోల్పోయారు. ఇందులో 62లక్షల రూపాయలను రికవరీ చేయగల్గారు. ఘనాలోని స్కామర్లు ప్రజలను వివిధ మార్గాల్లో మోసం చేశారు. నకిలీ కొరియర్ లేదా కస్టమ్ షిప్మెంట్ ఫీజుల వంటి రూపంలో.

అలాగే చాట్ ల సమయంలో వ్యక్తిగత వీడియోలను రికార్డు చేసి, వాటితో బ్లాక్మెయిల్ చేశారు. ఈ గ్యాంగ్ సెలబ్రిటీలుగా మారి, సోషల్ మీడియా, డేటింగ్ సైట్లలో 120 మందిని మోసం చేసి సుమారు రూ 30లక్షల నగదును దోచుకుంది. ఎక్కువగా సోషల్ మీడియా(Social media) ద్వారానే వీరిని లక్ష్యంగా చేసుకున్నారు స్కామర్లు. నకిలీ పత్రాలు ఉపయోగించి ఫేక్ ఐడెంటిటీలను సృష్టించి, డబ్బు దోచేటప్పుడు తమ నిజమైన గుర్తింపు తెలియకుండా జాగ్రత్తపడ్డారు.

సైబర్ నేరాలపై ఆఫ్రికన్ జాయింట్ ఆపరేషన్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన ఈ ఆపరేషన్ లో బెనిన్, బుర్కినా ఫాసో, దిగాంబియా, గినియా, కెన్యా, నైజీరియా, రువాండా, దక్షిణాఫ్రికా, ఉగాండా, జాంబియా దేశాలు కూడా పాల్గొన్నాయి.

రొమాన్స్ స్కామ్ ముఠాలపై స్టింగ్ ఆపరేషన్ ఎక్కడ జరిగింది?
ఇది 14 ఆఫ్రికన్ దేశాల్లో జరిగింది.

ఈ ఆపరేషన్‌లో ఎంతమంది సైబర్ నేరగాళ్లు అరెస్టయ్యారు?
260మంది అనుమానితులు అరెస్టయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Africa Scam Arrests CyberCrime Google News in Telugu Interpol Operation Latest News in Telugu Online Fraud Romance Scam Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.