ఆఫ్ఘనిస్థాన్ లో (Afghanistan) తాలిబన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ పాలనలో ఎన్నో కఠిన నియమాలు ఉన్నాయి. మతం పేరుతో మహిళలకు ఏమాత్రం స్వేచ్చ లేకుండా చేశారు. వారిని ఉన్నత విద్యకు దూరం చేశారు. ఇక ఉద్యోగం. ఆమాటే ఎత్తకూడదు. ఇక ఎవరైనా నేరాలు చేస్తే మాత్రం బహిరంగంగా వారిని శిక్షిస్తారు. వేలప్రజల మధ్యలో నేరస్తుడిని శిక్షిస్తారు. అందరూ చూస్తుండగానే ఉరి తీస్తారు.
Read Also: Ditwa Floods: మూడుదేశాలను ముచ్చెత్తిన వరదలు..1230 మంది మృతి
తాజాగా ఓ వ్యక్తికి ఇచ్చిన శిక్ష పెనుచర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. తాజాగా ఒకే కుటుంబంలో 13 మందిని ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు.అయితే తాలిబన్లు ఈ నేరస్తుడికి బహిరంగంగా శిక్షను విధించారు.
80వేలమంది ప్రజల మధ్యలో కాల్చారు
ఖోస్ట్ ప్రావిన్స్ లో కొన్ని నెలల క్రితం తొమ్మిదిమంది పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన 13మందిని ఓ వ్యక్తి అతికిరాతకంగా హత్య చేశాడు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు (Supreme Court) నిందితుడికి మరణశిక్ష విధించింది. కోర్టు తీర్పుతో తాలిబన్ పాలకులు హంతకుడికి బహిరంగంగా మరణశిక్ష అమలు చేశారు. సుమారు 80వేలమంది చూస్తుండగానే బాధిత కుటుంబంలోని 13ఏండ్ల బాలుడితో హంతకుడిని అతికిరాతంగా కాల్చి చంపించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హంతకుడికి మంగల్ గా గుర్తించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: