సెప్టెంబర్ 1న ఆఫ్ఘనిస్తాన్‌ను అతలాకుతలం చేసిన భూకంపం, దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో నమోదైన ఈ ప్రకృతి విపత్తు వేలాది ప్రజల జీవితాలను మింగేసింది.
1,400 పైగా మరణాలు… వేలాది మందికి గాయాలు
తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ (Zabihullah Mujahid) ప్రకారం, ఈ భూకంప ఘటనలో 1,411 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 3,100 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు. మృతి చెందిన వారిలో చాలామంది నిద్రలో ఉండగా, శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు.
గ్రామాలపై భూకంప ప్రభావం… ఇళ్లు నేలమట్టం
ఈ భూకంప ధాటికి 5,400 కంటే ఎక్కువ ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి(houses were completely destroyed). అధికంగా మట్టి మరియు కలపతో నిర్మితమైన ఇళ్లు ఉండటం వల్ల భూకంప తీవ్రతను తట్టుకోలేక పేకమేడల్లా కూలిపోయాయి. అనేక గ్రామాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. దీంతో వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యారు.
సహాయక చర్యలకు అడ్డుగోడలుగా మారుతున్న భౌగోళిక పరిస్థితులు
ప్రస్తుతం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పర్వత ప్రాంతాలు, మరియు బసిరహిత ప్రాంతాలు రక్షణ చర్యలకు ప్రధాన అడ్డంకిగా మారాయి. ఘటనా స్థలాలకు చేరుకోవడం సహాయక బృందాలకు పెద్ద సవాలుగా మారింది.
ఐక్యరాజ్యసమితి ఆందోళన… మద్దతు కోరుతున్న తాలిబన్
ఈ విషాదకర ఘటనపై ఐక్యరాజ్యసమితి అధికారి ఇంద్రికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, సామాజిక సమస్యలతో సతమతమవుతున్న ఆఫ్ఘనిస్తాన్‌కు అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
మూడో పెద్ద భూకంపం – తాలిబన్ పరిపాలనకు మరో పరీక్ష
2021లో తాలిబన్ అధికారం చేపట్టిన తర్వాత ఇది మూడవ అతిపెద్ద భూకంపం. అయితే, తాలిబన్ ప్రభుత్వ విధానాలపై ఉన్న విమర్శలు, ముఖ్యంగా మహిళల హక్కులపై విధించిన ఆంక్షలు, దేశానికి వచ్చే విదేశీ సహాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర సంక్షోభాల మధ్య ఆఫ్ఘనిస్తాన్‌కు తగినంత మద్దతు లభించడం సంకటంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: